ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సినిమా థియేటర్లలో తనిఖీలు

ABN, Publish Date - May 28 , 2025 | 01:02 AM

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలోని సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాకినాడతోపాటు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోను సినిమా థియేటర్ల నిర్వహణ, వాటిలో సౌకర్యాలపై ఆయా జిల్లాల అధికారులు మంగళవారం రాత్రి ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కాకినాడ ఆనంద్‌ సినిమాస్‌లో తనిఖీ చేస్తున్న పెదపూడి ఎమ్మార్వో, నగరపాలక సంస్థ ఎంహెచ్‌వో
  • తినుబండారాల నాణ్యత, ధరలపై అధికారుల ఆరా

  • థియేటర్లలో పారిశుధ్య నిర్వహణ పరిశీలన

కాకినాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఉమ్మడి జిల్లాలోని సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాకినాడతోపాటు కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోను సినిమా థియేటర్ల నిర్వహణ, వాటిలో సౌకర్యాలపై ఆయా జిల్లాల అధికారులు మంగళవారం రాత్రి ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని మండలాల తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, అగ్నిమాపక, ఫుడ్‌ సేఫ్టీ, పోలీసులు, తూనికలు కొలతలశాఖ అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని, థియేటర్లలో ఆహార నాణ్యత, ధరల నియంత్రణ, టికెట్‌ ధరలు, తినుబండారాల విక్రయం, థియేటర్‌ ఫిట్‌నెస్‌, ఫైర్‌, ఫుడ్‌ సేఫ్టీ, శానిటేషన్‌ తదితర అంశాలను పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు. కాకినాడలో కాకినాడ అర్బన్‌ తహశీల్దార్‌ వి.జితేంద్ర కాకినాడలోని సీఅండ్‌సీ(చాణుక్య, చంద్రగుప్త) థియేటర్‌ను, కాకినాడ రూరల్‌, తాళ్లరేవు తహశీల్దార్లు కుమా రి, పితాని త్రినాథరావులు దేవీ మల్టీప్లెక్స్‌ థియేటర్లను తనిఖీ చేశారు. పెదపూడి తహశీల్దార్‌ పీవీ సీతాపతిరావు, కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖాధికారి పృథ్వీచరణ్‌, తదితరుల బృం దం ఆనంద్‌, గీత్‌, సంగీత్‌ థియేటర్లను తనిఖీ చేసింది. నిబంధనల ప్రకారం థియేటర్లను నిర్వహిస్తున్నారా? అన్ని లైసెన్సులు ఉన్నాయా? లేవా? వాష్‌ రూమ్స్‌ నిర్వహణ, తినుబండారాల అమ్మకాలు, హాలులో సిట్టింగ్‌ సౌకర్యవంతంగా ఉందా? ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పలు థియేటర్లలో లోపాలను గుర్తించారు. కాకినాడలోని ఆనంద్‌, అంజనీ, గీత్‌, సంగీత్‌, తిరుమల థియేటర్లను తనిఖీ బృందాలు పరిశీలించాయి. జిల్లాలోని తునిలో శ్రీరామ్‌, పిఠాపురంలో వెంకటేశ్వర, శ్రీసత్య, ఏలేశ్వరం జయశ్రీ, పెద్దాపురం వీరభద్ర థియేటర్లలోను అధికారుల బృందం తనిఖీలు చేసింది. ఈ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని అధికారులు తె లిపారు.

Updated Date - May 28 , 2025 | 01:02 AM