సిరిగలపల్లిలంకలో చైన్ స్నాచింగ్
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:37 AM
కరప, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లిలంక గ్రామంలో చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాజులూరు మండలం గొల్లపాలెంలో నివాసముంటున్న కొండేపూడి శాంతికుమారి కరప మండలం వేళంగి స్టేట్‌బ్యాంక్‌లో
స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ
కరప, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లిలంక గ్రామంలో చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాజులూరు మండలం గొల్లపాలెంలో నివాసముంటున్న కొండేపూడి శాంతికుమారి కరప మండలం వేళంగి స్టేట్‌బ్యాంక్‌లో టెంపరరీ మెసెంజర్‌గా పనిచేస్తుంది. సోమవా రం రాత్రి డ్యూటీ ముగించుకుని స్కూటీపై ఇంటికి బయలుదేరింది. సిరిగలపల్లిలంక దాటిన వెంటనే వెనుక నుంచి ఇద్దరు దొంగలు మోటర్‌సైకిల్‌పై ఆమెను వెంబడించి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థా నికులు అక్కడకు చేరుకుని గొల్లపాలెం వైపుగా పారిపోయిన దొంగలను వెంబడించినా వారి ఆచూకీ లభించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరప ఎస్‌ఐ తోట సునీత ఘటనాస్థలికి వెళ్లి విచారించారు. ఎరుపు రంగు గ్లామర్ బండిపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు కొద్దిసేపు అక్కడ చక్కర్లు కొట్టారని, దీంతో అనుమానం వచ్చి వారి బండి నెంబర్‌ను (ఏపీ05 2694) గుర్తుపెట్టుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి ఒక రు పోలీసులకు తెలిపాడు. కాగా చైన్ స్నాచింగ్ జరిగిన ప్రదేశాన్ని మంగళవారం కాకినాడరూరల్ సీఐ చైతన్యకృష్ణ పరిశీలించి బాధితురాలు, స్థానికులను విచారించారు. స్థానిక రామాలయంలో సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సునీత తెలిపారు.
Updated Date - Jun 04 , 2025 | 01:37 AM