ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై 34 కేసులు

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:29 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 2 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలు ప్రారం భంకావడంతో కాకినాడ జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు బస్సులు ఫిట్నెస్‌ పూర్తి చేసుకోగా, మిగిలిన బస్సులు ఫిట్నెస్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీవో శివారెడ్డి ఆ

కాకినాడలో స్కూల్‌ బస్సులను తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు, పోలీసులు

రూ.1.58 లక్షలు జరిమానా

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 2 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలు ప్రారం భంకావడంతో కాకినాడ జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు బస్సులు ఫిట్నెస్‌ పూర్తి చేసుకోగా, మిగిలిన బస్సులు ఫిట్నెస్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీవో శివారెడ్డి ఆధ్వర్మంలో గత రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించి పలు కేసులు నమోదు చేశారు. కాకినాడ అన్నమ్మ ఘాటీ సెంటర్‌, అచ్చంపేట జంక్షన్‌, పెద్దాపురం, కత్తిపూడి, జగ్గంపేట వంటి పలు ప్రాంతాల్లో ప్రైవేటు స్కూల్‌ బస్సులను ఆపి మోటర్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌లు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. 2రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఎటువంటి నిబంధనలు పాటించని వివిధ పాఠశాలల బస్సులపై 34 కేసులు నమోదు చేసి రూ.1.58 లక్షలు జరిమానా విధించామని డీటీసీ శ్రీధర్‌ తెలిపారు. అవసరమైతే ఫిట్నెస్‌ లేని బ స్సులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. అంద రూ వాహనాల సర్టిఫికెట్లను లైసెన్సులను పరివాహన యాప్‌ లేదా డీజీ లాకర్‌ యాప్‌లు డౌన్లోడ్‌ చేసుకుని వాటిలో భద్రపరుచుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు ధ్రుపత్రాలను అడిగినప్పుడు వాటిని చూపిస్తే సరిపోతుందని ఆ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. వాహనాలు తనిఖీచేసే పోలీస్‌ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్లు బివి.మురళీకృష్ణ, ఎన్‌.సబితా, బి.శ్రీనివాస్‌, కే.ప్రసాద్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్లు ఎస్‌.గౌరీ శంకర్‌, ఏం.కళాజ్యోతి, కెవి.నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:29 AM