వాలిడేషన్ చట్టాన్ని రద్దుచేయాలి
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:23 AM
వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేసి అందరికీ ఒకేలా పే కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసో సియేషన్ నిరసన నిర్వహించింది. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద శుక్రవారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
రాజమహేంద్రవరంలో పెన్షనర్ల నిరసన
రాజమహేంద్రవరం సిటీ, జూలై 25(ఆంధ్ర జ్యోతి): వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేసి అందరికీ ఒకేలా పే కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసో సియేషన్ నిరసన నిర్వహించింది. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద శుక్రవారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇటివల కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ ప్రిన్సిపుల్స్ ఫర్ ఎక్స్‌పన్జీచర్ ఆఫ్ పెన్షన్స్ పేరుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309ను అనుసరించి 2023లో కొన్ని మార్పు లను చేస్తూ 2025లో పార్లమెంట్‌లో ఆమోదించారని దీని వల్ల పెన్షనర్లు కమిషన్ అమలుకు ముందు రిటైరైన వాళ్లు, అమలు తర్వాత రిటైరైన వాళ్లు అని విభజింపబడ్డారని తెలిపారు. ఫలితంగా పే కమిషన్‌కు ముందు రిటైరైన ఉద్యోగులకు గతంలో మాదిరిగా పెన్షన్ రివిజన్ అడిగే హక్కు కోల్పోతారని, పాత పెన్షన్ మీదే శేషజీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఎప్పటికీ వారి పెన్షన్‌లో డీఏలు తప్ప ఇతరాత్ర పె రుగుదల ఉండదన్నారు. రెండు వర్గాలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. శివ కమిషన్ ప్రతిపాదనలను పెన్షనర్లందరికీ ఒకేలా అమలు చేయాలని, 8వ వేతన సంఘా న్ని నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్లు కె.భాస్కరరావు, బీఎస్‌ఎన్‌ఎల్ తరపున ఆర్‌ఎస్ ఎన్ మూర్తి, కె.సన్యాసిరావు, ఏవీవీ సత్యనారాయణ, పోస్టల్ తరపున డి.తిరుపతిరావు, ఎంవీ రత్నం, సీహెచ్ ధర్మరాజు, ఎస్ ఎన్‌పీఏడబ్ల్యూఏ నుంచి ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, కేఎస్ ఎన్ రాజు, చిక్కాల వెంకటరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 01:23 AM