ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాలువల్లో పూడికతీతలని చెప్పి.. గుర్రపుడెక్క తొలగించారు

ABN, Publish Date - Jun 20 , 2025 | 01:17 AM

బిక్కవోలు మండలంలో ఏప్రిల్‌ 2023 నుంచి మార్చి 2024 వరకూ ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగిన రూ.11,98,76,310ల పనులపై సామాజిక తనిఖీలు జరిపామని డ్వా మా పీడీ ఎ.నాగమల్లేశ్వరరావు తెలిపారు. స్థాని క మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ తేతలి సుమ అధ్యక్షతన మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

ప్రజావేదికలో మాట్లాడుతున్న పీడీ నాగమల్లేశ్వరరావు
  • డ్వామా పీడీ నాగమల్లేశ్వరరావు

  • బిక్కవోలులో రూ. 11.98 కోట్ల పనులపై సామాజిక తనిఖీలు

బిక్కవోలు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): బిక్కవోలు మండలంలో ఏప్రిల్‌ 2023 నుంచి మార్చి 2024 వరకూ ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగిన రూ.11,98,76,310ల పనులపై సామాజిక తనిఖీలు జరిపామని డ్వా మా పీడీ ఎ.నాగమల్లేశ్వరరావు తెలిపారు. స్థాని క మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం ఎంపీపీ తేతలి సుమ అధ్యక్షతన మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఈనెల 1 నుంచి 18 వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన పనులను ఎస్‌ఆర్‌ పీ, డీఆర్‌పీల ఆధ్వర్యంలో గ్రామ ఆడిటర్లు తనిఖీలు జరిపారని వాటిని గ్రామా ల వారీగా వివరిస్తున్నారన్నారు. ముందుగా ఆర్‌ ఎస్‌.పేట, ఆరికరేవుల, బిక్కవోలు, రంగాపురం, కాపవరం, ఊలపల్లి, ఇల్లపల్లి గ్రామాల్లో జరిగిన పనుల్లో అవకతవకలను డీఆర్‌పీలు ప్రసాదరావు, నల్లబాబు, బాబ్జి, జయప్రకాష్‌, రవికిరణ్‌ సభలో వివరించారు. వీటిలో ఎక్కువగా పనులు జరిపిన చోట బోర్డులు పెట్టకుండా పెట్టినట్లు, కాలువల్లో పూడికతీతలకు బదులు గుర్రపుడెక్క తొలగించడం, జాబ్‌ కార్డు దారులందరికీ పను లు కల్పించకపోవడం, పనులు చేసే చోట ప్రథ మ చికిత్స పెట్టెలు, టెంట్‌లు వేయకపోవడం, డ్రైయిన్లు పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం వం టివి వున్నాయి. ఇంకనూ మిగిలిన గ్రామాలైన తొస్సిపూడి, పందలపాక, కొంకుదురు, కొమరిపా లెం, మెళ్లూరు, బలభద్రపురం గ్రామాల్లో కనుగొన్న అవకతవకలను వివరించవలసి ఉంది. ఇంకనూ ప్రజావేదిక కొనసాగుతుంది. కార్యక్రమంలో సోషల్‌ ఆడిట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బి.రా మారావు, జిల్లా విజిలెన్స్‌ ఆఫీసర్‌ రత్నకుమారి, ఎస్‌టీఎం గౌరిశంకర్‌, అంబుడ్స్‌మెన్‌ భాషా, ఎం పీడీవో శ్రీనివాస్‌, ఏపీవో అగస్టీన్‌, కూటమి నాయకులు చౌదరి, దుర్గారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, త్రిమూర్తులు, రెడ్డి శ్రీను, పడాల చినబుజ్జి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, డీవీఆర్‌, అప్పలస్వామి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 01:18 AM