ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉమ్మడి తూర్పు గోదావరి’తో బీవీ పట్టాభిరామ్‌కు అనుబంధం

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:46 AM

రామచంద్రపురం(ద్రాక్షారామ)/కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ మృతితో గోదావరి జిల్లాల్లోని ఆయన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషుల్లో విషాదం నెలకొంది. ఆయనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యేక అనుంబంధం ఉంది. పట్టాభిరామ్‌ నెల్లూరు జిల్లాలో జన్మించిన్పటికీ.. ఆయన తండ్రి బీవీ సత్యనారాయణ కాజులూరు మండలం శీల గ్రామంలో జ న్మించినట్టుగా సమాచారం. ఆయన వృత్తి రీత్యా వే

విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్న పట్టాభిరామ్‌ (ఫైల్‌)

రామచంద్రపురంలోని కృత్తివెంటి జాతీయోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం

కాకినాడలో డిగ్రీ విద్య పూర్తి

ఇంద్రజాలకుడిగా ప్రదర్శనలు

కాకినాడలో వ్యక్తిత్వ

వికాస తరగతుల నిర్వహణ

రామచంద్రపురం(ద్రాక్షారామ)/కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 1(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఇంద్రజాలికుడు బీవీ పట్టాభిరామ్‌ మృతితో గోదావరి జిల్లాల్లోని ఆయన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషుల్లో విషాదం నెలకొంది. ఆయనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యేక అనుంబంధం ఉంది. పట్టాభిరామ్‌ నెల్లూరు జిల్లాలో జన్మించిన్పటికీ.. ఆయన తండ్రి బీవీ సత్యనారాయణ కాజులూరు మండలం శీల గ్రామంలో జ న్మించినట్టుగా సమాచారం. ఆయన వృత్తి రీత్యా వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో ఆయన తండ్రి సత్యనారాయణ అప్పటి తూర్పుగోదావరి జిల్లా.. ప్రస్తుతం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచందప్రురం మం డలం చెల్లూరు సర్వారాయ సుగర్స్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. దీంతో ఆయన కుటుంబం రామచంద్రపురంలో నివాసం ఉండేది. ఈ నేపథ్యంలో పట్టాభిరామ్‌ బాల్యం అంతా ఇక్కడే సాగింది. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. దీంతో కృత్తివెంటి జాతీయోన్నత పాఠశాల పూర్వవిద్యార్థిగా బీవీ పట్టాభిరామ్‌ను 2009లో రామచంద్రపురంలో పూర్వవిద్యార్థుల సంఘం సత్కరించింది. ఆయన, ప్రము ఖ గేయ రచయిత దివంగత అదృష్టదీపక్‌ ఇద్ద రూ క్లాస్‌మేట్స్‌. కాకినాడ పీఆర్‌ కాలేజీలో డిగ్రీ.. కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో బీఏ చది వారు. పట్టాభిరామ్‌కు కౌమారదశలో కాలి వైక ల్యం కలిగింది. దీంతో ఆయన ఆత్మన్యూనతా భావానికి గురికాగా దాన్ని జయించి తనని తాను ఇంద్ర జాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు. డిగ్రీ చదవుతున్న సమయంలో ప్రముఖ ఇంద్ర జాలికుడు ఎంబార్‌రావు వద్ద మంత్రజాల విద్య లో మెళకువలు నేర్చుకున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక స్టేజీలపై ఇంద్రజాల ప్రదర్శన లిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవారు. వ్యక్తి త్వ వికాస నిపుణిడిగా పలుమార్లు కాకినాడలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఆ యన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

ప్రజలను జాగృతం చేస్తూ కార్యక్రమాలు

పట్టాభిరామ్‌ ఇంద్రజాల విద్యతో చేతబడి వంటి మూ ఢనమ్మకాలపై ప్రజలను జా గృతం చేసే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నాటిజాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి పలు రుగ్మతలను పోగొట్టవచ్చని ని రూపించారు. అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ప్రోత్సాహం తో ఇంద్రాజాలన్ని జోడించి ప్రభుత్వ పథకాలు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలపై ప్రచా రం కల్పించారు. వరద బాధితుల కోసం ప్రదర్శనలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దూరదర్శన్లో కొన్ని సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించారు. జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన రెం డురెళ్లు ఆరు లోనూ డాక్టర్‌ పట్టాభిరామ్‌గానే కనిపించారు. పలు పత్రికల్లో వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు. పలు పర్యాయాలు రామచంద్రపురంలో ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చారు.

Updated Date - Jul 02 , 2025 | 12:46 AM