24 వరకు ఆర్టీసీ ఏసీ బస్సుల టిక్కెట్ ధరల తగ్గింపు: డీఎం
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:26 AM
అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు ఈనెల 24వతేదీ వరకు ప్రత్యేక తగ్గింపు ధరలు ఇస్తున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు.
అమలాపురం రూరల్, జూలై 8(ఆంధ్రజ్యోతి): అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి బయలుదేరే ఏసీ బస్సులకు ఈనెల 24వతేదీ వరకు ప్రత్యేక తగ్గింపు ధరలు ఇస్తున్నట్టు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. తగ్గించిన టిక్కెట్ ధరల వివరాలు ప్రకటించారు. అమలాపురం డిపో నుంచి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు వెళ్లే అమరావతి ఏసీ బస్సుకు ప్రస్తుత టిక్కెట్ ధర రూ.1430 కాగా రూ.1170కు టిక్కెట్ ధర తగ్గించామన్నారు. హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌కు వెళ్లే నైట్‌రైడర్ ఏసీ బస్సు ధర రూ.1190 కాగా రూ.980కు తగ్గించారు. బెర్త్ ప్రస్తుత ధర రూ.1390 కాగా రూ.1130కు తగ్గించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే నైట్‌రైడర్ ఏసీ టిక్కెట్ ధర రూ.1280 కాగా రూ.1050కు తగ్గించగా ప్రస్తుత బెర్త్ రూ.1480 కాగా రూ.1220కు తగ్గించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఇంద్ర బస్సు టిక్కెట్ ధర రూ.1140 కాగా రూ.990కు తగ్గించారు. అమలాపురం నుంచి విజయవాడ వెళ్లే ఇంద్రబస్సు ప్రస్తుతధర రూ.510 కాగా రూ.470కు, విశాఖపట్నానికి వెళ్లే ఇంద్ర బస్సు టిక్కెట్ ధర రూ.580 కాగా రూ.530కు తగ్గించారు. ఈ అవకాశం ఈనెల 24 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. పైన తెలిపిన తగ్గింపు ధరలకు అదనంగా ఒకేసారి అప్ అండ్ డౌన్ టిక్కెట్లు తీసుకునేవారికి అదనంగా పదిశాతం రాయితీ పొందవచ్చునన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:26 AM