గేదెలు పోతున్నా.. పట్టదా!
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:43 AM
రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్నేళ్లుగా పాడి గేదెల దొంగతనాలు యథేచ్ఛగా జరుగు తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.దీంతో పాడి గేదెలనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న కొంతమంది రైతులు, యజ మానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమి ట్టాడు తున్నారు.
బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
దిక్కుతోచని స్థితిలో రైతులు
తాజాగా తూర్పుగోనగూడెంలో రెండు గేదెలు అపహరణ
రాజానగరం, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాజా నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్నేళ్లుగా పాడి గేదెల దొంగతనాలు యథేచ్ఛగా జరుగు తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.దీంతో పాడి గేదెలనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న కొంతమంది రైతులు, యజ మానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమి ట్టాడు తున్నారు. బాధిత యజమానులు పనులు మానుకుని పోలీస్‌స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి చేసేది లేక దిగు లు చెందుతున్నారు. పాడి పశువులు, గేదెలు దొంగతనాలకు సం బంధిం చి ఇప్పటివరకు ఒక కేసు పోలీ సులు ఛేదించలేకపోయారు. తూర్పుగోనగూడెంలో గతంలో ఓ రైతుకు చెందిన పాడి గేదెలను రాత్రి సమయంలో అప హరించు కుపోయారు. దీనిపై బాధిత యజ మాని పోలీసుల చుట్టూ తిరగలేక మిన్నకుండిపోయారు.విస్తృత పరిధి కలిగిన రాజానగరం పోలీస్ స్టేషన్ కు ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, 30 మందికి పైబడి కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న పశువుల లారీల నుంచి డబ్బు వసూళ్లపై ఉన్న శ్రద్ధ మండలంలో నిత్యం జరుగుతున్న దొంగతనాలను అరికట్టడంలో గానీ, దొంగలను పట్టుకోవడంలో గానీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు పాడిగేదెలు అపహరణ
మండలంలోని తూర్పుగోనగూడెం గ్రామా నికి చెందిన అబ్బిరెడ్డి పుల్లయ్యకు చెందిన రెండు పాడి గేదెలను ఆదివారం రాత్రి దొం గలు అపహరించుకుపోయారు. బాధిత యజ మాని పాడి గేదెలనే జీవనాధారంగా కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. గ్రామ శివారు లోని వడిశలేరు రోడ్డులో మకాంలో కట్టిన రెండు గేదెలను వాహనంలో ఎక్కుంచుకు పోయి, లేగ దూడలను అక్కడే వదిలిపెట్టారు. చోరీకి గురైన గేదెల విలువ రూ.2 లక్షలు వరకు ఉంటుందని బాధిత యజమాని బో రున విలపించారు. ఈ విషయమైన అతడు సోమవారం ఉదయం రాజానగరం పోలీసు లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Updated Date - Jul 22 , 2025 | 01:43 AM