ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరీక్షల్లో ఫెయిలయ్యా.. ఒంటరితనం ఫీలవుతున్నా..

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:52 AM

రాజానగరం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని సోమవారం కళాశాల వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడింది. నెల్లూరు జిల్లా నర్సాపురం మండలం గుడ్లూరు గ్రామానికి చెందిన పరుచూరి ప్రగతి (19) బీటెక్‌ చదువుతోంది. సెకండ్‌ సెమ్‌ తరగ తులు సోమవారం నుంచి ప్రారంభం కావడం తో ఆదివారం విద్యార్థిని స్వగ్రామం నుంచి కళా శాల వసతి గృహా

ఉరేసుకుని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

రాజానగరం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని సోమవారం కళాశాల వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడింది. నెల్లూరు జిల్లా నర్సాపురం మండలం గుడ్లూరు గ్రామానికి చెందిన పరుచూరి ప్రగతి (19) బీటెక్‌ చదువుతోంది. సెకండ్‌ సెమ్‌ తరగ తులు సోమవారం నుంచి ప్రారంభం కావడం తో ఆదివారం విద్యార్థిని స్వగ్రామం నుంచి కళా శాల వసతి గృహానికి చేరుకుంది. మొదటి సెమ్‌లో 4 పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని, దీంతో మానసికంగా ఆందోళనకు లోనవుతూ, ఒంటరి తనం ఫీలవుతున్నానని, తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ ను సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నా మని సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ తెలిపారు. ప క్కగదిలో ఉంటున్న స్నేహితులు తరగతులకు వెళ్లగా ప్రగతి.. బయటకు కనిపించకుండా దు ప్పటి అడ్డుగా ఏర్పాటు చేసుకుని దుస్తులు ఆరబెట్టుకునే హుక్కుకు చున్నీని బిగించుకుని ఉరేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:52 AM