ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీలో గ్రూపులు, పైరవీలకు చోటులేదు

ABN, Publish Date - Apr 08 , 2025 | 11:41 PM

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో గ్రూపులు, పైరవీలకు చోటు ఉండదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానం ఉపేక్షించదనే విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్సీగా రెండో సారి ఎన్నికైన సోము వీర్రాజుకు అభినందన సత్కారసభ

సోమును అభినందిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు

అలాంటి వారిని అధిష్టానం ఉపేక్షించదు

ఎమ్మెల్సీ సోము అభినందన సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో గ్రూపులు, పైరవీలకు చోటు ఉండదని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానం ఉపేక్షించదనే విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో బీజేపీ ఎమ్మెల్సీగా రెండో సారి ఎన్నికైన సోము వీర్రాజుకు అభినందన సత్కారసభ నిర్వహించారు. ఈ సభకు శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సోము వీర్రాజు లేకపోతే తాను లేనన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏఐఎస్‌ఎఫ్‌లో ఉన్న తనను బీజేపీలోకి తీసుకొచ్చింది వీర్రాజేనని, పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేయబట్టే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీ కోసం మనం పడిన కష్టమే గుర్తింపు, పదవులు తెచ్చిపెడుతుందని, సోము వీర్రాజుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కడం అందుకు ఉదాహరణ అన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ వీర్రాజు 40 ఏళ్ల కిత్రం ఏ పార్టీలో చేరారో అదే రాజకీయపార్టీలో కొనసాగడం ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు. శ్రీనివాస వర్మ, దుర్గేష్‌లు వీర్రాజుకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.

త్వరలో తమిళనాడు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం : సోము

తమిళనాడులో త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, తర్వాత తెలంగాణాలోనూ తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం పలికారు. ఎప్పుడు ఏం చేయాలో బీజేపీకి ఒక వ్యూహం ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతి నెలా వేల కోట్లు అప్పులు ఇప్పించేవాళ్లం. అంతే చేశాం. పోలవరానికి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నిధులు, రైల్వేజోన్‌ వంటివి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సీఎం అయ్యాక డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రాష్ట్రంలోని రొయ్యల రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర మంతి శ్రీనివాసవర్మ కృషి చేస్తారన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో బీజేపీ ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, బీవీఎన్‌ మాధవ్‌, విష్ణువర్థన్‌రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ యువమోర్చా నాయకుడు నాగిరెడ్డి దుర్గామహేష్‌, పాకా సత్యనారాయణ, కంబాల శ్రీనివాసరావు, భద్రం మాట్లాడారు. రాష్ట్ర నాయకులు నిర్మల, ముళ్లపూడి రేణుక, రేలంగి శ్రీదేవి, అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. కాపు సంఘం నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులుసోము వీర్రాజును ఘనంగా సత్కరించారు. అం తకుముందు కోటిపల్లి బస్టాండు సెంటర్‌ నుంచి సభా వేదిక వరకూ నిర్వహించిన భారీ ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:41 PM