పేరు నమోదు చేయలేదా..చచ్చామే!
ABN, Publish Date - Jun 20 , 2025 | 01:15 AM
బర్త్ సర్టిఫికెట్లకు ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. చిన్న చిన్న సవరణలు, తప్పులు స రిదిద్దడంలో సహాయ పడవలసిన గణాంకా ధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక సర్టిఫికెట్ కు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది.
బర్త్ సర్టిఫికెట్లకు కష్టాలు
పేర్లు సవరించడానికి ఆంక్షలు
సవరణకో దరఖాస్తు
ఒక్కో సవరణకు రూ. 100
ప్రజలకు తప్పని కష్టాలు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
బర్త్ సర్టిఫికెట్లకు ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. చిన్న చిన్న సవరణలు, తప్పులు స రిదిద్దడంలో సహాయ పడవలసిన గణాంకా ధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక సర్టిఫికెట్ కు నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. పిల్లల పేర్లు ,తల్లిదండ్రుల పేర్లు పూర్తిగా నమోదు కాకపోతే సవరించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సవరణలకు సవాలక్ష ప్రశ్నలు, కాగితాలతో ఇబ్బందులు పెడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లిదండ్రులు, పిల్లల పేర్లు విష యంలో మూడు తప్పుల వరకూ ఒక దర ఖాస్తు చేస్తే సరిపోయేది. అప్పట్లో రూ.50 చెల్లిస్తే మీ సేవలో నమోదు చేసి మునిసిపల్ అధికారులు ఆమోదించేవారు. కానీ గత వైసీపీ ఒక పొరపాటుకు ఒక దరఖాస్తు చేయాలి. ఉదాహరణకు తండ్రి, తల్లిపేర్లు తప్పుగా పడితే రెండు దరఖాస్తులు చేయవలసిందే. ఒక్క దర ఖాస్తుకు ఒక రోజు నుంచి వారం వరకూ పట్ట వచ్చు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే నెలలు పట్టవచ్చు. మొదట దరఖాస్తులో తండ్రి పేరు సరి చేస్తే అది అనుమతి పొందిన తర్వాత.. రెండో దరఖాస్తులో తల్లిపేరు సవరించుకోవాలి. ఒక్కోసారి దరఖాస్తుకు రూ. 100, మీ సేవ నిర్వాహకుడికి రూ.50 చెల్లించాల్సిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిం ది. ఇప్పటికీ ఈ విధానాన్ని అధికారులు ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో సర్టిఫికెట్లకు ఇబ్బందులుపడుతున్నారు.
వినరు.. పట్టించుకోరు
రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొ రేషన్‌లో ఉపగణాంకాధికారి కార్యాలయంలో డెత్ అండ్ బర్త్ సర్టిఫికెట్ల జారీ చేయడం, సవరణలు చేయడం వంటివి చేస్తారు. కానీ అక్కడకు వచ్చే ప్రజల అనుమానాలను తీర్చే ఓపిక ఎవరికీ ఉండదు.ఒక మహిళ గౌరీపట్నం నుంచి వచ్చింది.. నా బిడ్డపేరు చాలా పెద్దగా పెట్టారు.దీనిని మార్చి చిన్నదిగా చేయాలని అడిగింది. అది జరగదు.. నీకు ముందు తెలి యదా? అని ఒక ఉద్యోగి సమాధానం. మరో వ్యక్తి తన బిడ్డ పేరులో చిన్న తప్పు దొర్లింది. దీనికి ఏమి చేయాలని అడిగితే.. అంతే..ఇక మారదనే సమాధానం. పైగా కోపంగా మాట్లా డడం, కొర్రీలు వేయడం తప్ప ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో ,దానికి ఏఏ ధృవీకరణ పత్రాలు కావాలో చెప్పేవారే లేరు. దీంతో అం దరూ మీసేవలు, తెలిసిన వారిని ఆరా అడగం, కాళ్లు అరిగేలా తిరగం తప్పడం లేదు. పిల్లలు పుట్టిన వెంటనే పేర్లు నమోదు చేసుకుంటే ఈ గొడవ ఉండదు. ఆసుపత్రిలో బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు కచ్చితంగా తమ ఆధార్‌లో పూర్తి పేర్లు ఎలా ఉంటే అలాగే న మోదు చేయించాలి.పిల్లల పేర్లు తర్వాత నమో దు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి.
కార్పొరేషన్‌లో నెట్ కష్టాలు
మునిసిపల్ కార్పొరేషన్‌లో గత గురువారం నుంచి ఇంటర్నెట్ కష్టాలు ఆరంభమయ్యాయి. నెట్ బాగా స్లోగా ఉంటోంది. సైట్ ఓపెన్ కావ డం లేదు. టెక్నీషియన్ వచ్చి సరిచేస్తే కాసేపు పనిచేస్తుంది. మళ్లీ ఇబ్బందులే. రోజూ వంద లాది మంది వచ్చి ఇక్కడ పడిగాపులు పడి వెళుతున్నారు. సోమవారం ఒక తల్లికి నెలలు కూడా నిండలేదు.. కవల పిల్లలతో ఒక తల్లి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం గమనార్హం. వైర్లు ఎలుకలు కొరికాయని ఒకరు, స్విచ్‌బోర్డు పనిచేయడం లేదని మరొకరు చెప్పడం తప్ప, సమస్యను పరిష్కరించడంలేదు.
Updated Date - Jun 20 , 2025 | 01:15 AM