అల్లవరంలో హడలు!
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:51 AM
అల్లవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం కొబ్బరి తోటలో శనివారం 5 అడుగుల తెల్ల తాచుపాము హడలెత్తిం
కొబ్బరి రాశుల్లో ఐదు అడుగుల భారీ తాచుపాము
అల్లవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం కొబ్బరి తోటలో శనివారం 5 అడుగుల తెల్ల తాచుపాము హడలెత్తించింది. కొబ్బరికాయలు ఒలుస్తుండగా కార్మికులు తాచుపామును చూసి భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్‌వర్మకు సమాచారం అందించారు. వర్మ పామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. కొబ్బరికాయల రాశుల్లో ఎలుకలు, కప్పలను తినడానికి పాములు వస్తాయని వర్మ తెలిపాడు.
Updated Date - Jul 27 , 2025 | 12:51 AM