ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గొల్లప్రోలులో వైసీపీకి గట్టి షాక్‌

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:23 AM

గొల్లప్రోలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ వైసీపీ పాలకులకు గట్టి షాక్‌ తగిలింది. పట్టణాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తెచ్చిన నిధులతో పనులు చేపట్టకుండా రెండు నెలలుగా అడ్డంకు లు సృష్టిస్తున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుకి చెక్‌ పెడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను వినియోగించుకుంటూ పనులకు పరిపాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి పు ష్కలంగా నిధులు సాధించడంతో పా

డిప్యూటీ సీఎం పవన్‌ ప్రతిపాదించిన పనులను అడ్డుకున్న వైసీపీ పాలకులు

గొల్లప్రోలు కౌన్సిల్‌ను పక్కనపెట్టి ఆమోదించిన కాకినాడ జిల్లా కలెక్టర్‌

మున్సిపల్‌ చట్టంలోని విచక్షణాధికారాన్ని వినియోగించుకుంటూ గ్రీన్‌సిగ్నల్‌

పనుల నిర్వహణకు తొలగిన అడ్డంకి

గొల్లప్రోలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ వైసీపీ పాలకులకు గట్టి షాక్‌ తగిలింది. పట్టణాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తెచ్చిన నిధులతో పనులు చేపట్టకుండా రెండు నెలలుగా అడ్డంకు లు సృష్టిస్తున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుకి చెక్‌ పెడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను వినియోగించుకుంటూ పనులకు పరిపాలనామోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడింది. గ్రామాల అభివృద్ధికి పు ష్కలంగా నిధులు సాధించడంతో పాటు పనులు వేగంగా జరుగుతుండడంతో పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని పిఠాపురంలో అభివృద్ధి పనుల నిర్వహ ణ నిమిత్తం రూ.3 కోట్లు, గొల్లప్రోలుకు రూ.కోటి మంజూరు చేయించారు. ఈ నిధులతో ఆయా పట్టణాల పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను ప్రతిపాదించారు. ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే పిఠాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో పాటు టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. అయితే గొల్లప్రోలు పట్టణంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది.

తొలి నుంచీ ఆటంకాలే..

కలెక్టర్‌ సూచనలకు అనుగుణంగా గొల్లప్రోలు పట్టణానికి మంజూరైన రూ.కోటితో వివిధ ప్రాం తాల్లో 27 రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రతిపాదించి మే 29న జరిగిన గొల్లప్రోలు నగర పంచాయతీ సాధారణ, అత్యవసర సమావేశాల్లో కమిషనరు కనకరావు టేబుల్‌ అజెండాగా తీసుకురాగా వైసీపీ చైర్‌పర్సన్‌, పాలకవర్గం అభ్యంతరం తెలిపి వాయిదా వేశారు. అయితే టేబుల్‌ అజెండాను మినిట్స్‌ బుక్‌లో కూడా న మోదు చేయలేదు. జూన్‌లో వాయిదా వేసిన అ ంశాన్ని అజెండాకు రానివ్వకుండా చేసేందుకు కమిషనరు పంపిన అజెండాపై చైర్‌పర్సన్‌ సంతకం చేయలేదు. దీంతో జూన్‌ నెలలో సమావేశమే నిర్వహించలేకపోయారు. నిధులు మం జూరై మూడు నెలలు గడిచినా పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.

‘ఆంధ్రజ్యోతి’లో కథనం..

నగర పంచాయతీలో వైసీపీ పాలకవర్గం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తెచ్చిన కోటి రూపాయల నిధులతో ప్రతిపాదించిన పనులకు ఆమోదం తెలపకుండా అడ్డంకులు సృష్టిస్తున్న విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 2న కథనం ప్రచురితమైంది. ఇదే విషయాన్ని నగర పంచాయతీ కమిషనరు కనకారావు కలెక్టర్‌ షాన్‌ మోహన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్‌ చట్టం 1965లోని సెక్షన్‌ 68 కింద విచక్షణాధికారాన్ని వినియోగించుకుంటూ రూ. కోటితో 27 పనులు చేపట్టేందుకు పరిపాలనా ఆ మోదం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి బు ధవారం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయానికి చేరాయి. ఇదే విషయంపై కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. కలెక్టర్‌ ఆదేశాలపై కౌన్సిల్‌కు సమాచారం ఇచ్చి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 12:23 AM