ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రావులపాలెం ఎంవీఐ శ్రీనివాస్‌కు ‘ఉత్తమ’ అవార్డు

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:19 AM

రావులపాలెం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మోటార్‌వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఓలేటి శ్రీనివాస్‌ ఉత్తమ రహదారి భద్రత ఫెర్‌ఫార్మర్‌ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2

రావులపాలెం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మోటార్‌వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఓలేటి శ్రీనివాస్‌ ఉత్తమ రహదారి భద్రత ఫెర్‌ఫార్మర్‌ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2025 ఉత్తమ రహదారి భద్రతా ఫెర్‌ ఫార్మర్‌ అవార్డు శ్రీనివాస్‌ అందుకున్నారు. మహారాష్ట్ర లోని పూన్నైలో ఏఆర్‌ఏఐ డైరెక్టర్‌ నుంచి జాతీయ అ వార్డు, రూ.10వేల నగదు బహుమతిని తీసుకున్నారు. శ్రీనివాస్‌ రోడ్డు భద్రతపై 11 లఘు చిత్రాలను చిత్రీకరించారు. సినీ ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి సినిమా థియేటర్లలో రహదారి భద్రత లఘుచిత్రాలను ప్రదర్శించారు. రహదారి భద్రత కార్యకలాపాల్లో చేసిన కృషికి మంత్రులు సైతం అభినందించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలమేరకు రాష్ట్ర లీగల్‌ ఆథారిటీ వారు ప్రజల్లో రహదారి భద్రత అవగాహన కోసం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైటులో శ్రీనివాస్‌ నిర్మించిన హెల్మెట్‌ లఘుచిత్రాలను అప్‌లోడ్‌ చేశారు. పాఠశాలలో రోడ్డు భద్రత క్లబ్‌లను ప్రారంభించారు. నిర్భయ నిధి కింద ఉన్న ఆభయ ప్రాజెక్టులో మహిళలు, పిల్లలు, సురక్షిత రవాణా కోసం రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులుగా పనిచేశా రు. ఈసేవలకు గుర్తింపుగా ఆయనకు అవార్డులభించింది.

Updated Date - Apr 23 , 2025 | 12:19 AM