ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌ కవర్లో పసికందు

ABN, Publish Date - Jun 14 , 2025 | 12:31 AM

చింతూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఓ తల్లి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుక్షణమే పసికందుని ప్లాస్టిక్‌ కవర్లో ఉంచి ఆ కవర్‌ని చెట్టుకు వేలాడదీసి మాయమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచం ద్రపురం మండలం కొక్కిరిగూడెం అటవీ ప్రా ంతంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొక్కిరిగూ

ఆసుపత్రిలో పసికందు

అల్లూరి జిల్లా కొక్కిరిగూడెం అటవీ ప్రాంతంలో సంఘటన

చింతూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఓ తల్లి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుక్షణమే పసికందుని ప్లాస్టిక్‌ కవర్లో ఉంచి ఆ కవర్‌ని చెట్టుకు వేలాడదీసి మాయమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచం ద్రపురం మండలం కొక్కిరిగూడెం అటవీ ప్రా ంతంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొక్కిరిగూడెనికి చెందిన కొందరు అటవీ ప్రాం తానికి వేటకెళ్లారు. వారిలో మడివి రత్నరాజు కు ఓ చెట్టు వద్ద నుంచి పసికందు రోదన వినిపించింది. దీంతో చెట్టుకు వేలాడుతున్న ప్లాస్టిక్‌ కవర్‌తోపాటు అందులో ఉన్న పసి కందుని చూసి నివ్వెరపోయాడు. వెంటనే ఇం టికెళ్లి తల్లి ముత్తమ్మకు విషయాన్ని చెప్పాడు. దీంతో ముత్తమ్మ చెట్టు వద్దకు వెళ్లి పసి కందుని తీసుకుని ఇంటికెళ్లింది. విషయం తె లుసుకున్న కుందులూరు సబ్‌సెంటర్‌ ఏఎన్‌ ఎం గుంపెనపల్లి చంద్రమ్మ బృందం హుటా హుటిన పసికందుని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి నేతృత్వంలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు మహేష్‌ ఆ పసికందుకు వైద్యం అందిస్తున్నారు. బిడ్డ పుట్టి దాదాపు 7,8 గంట లపాటు ఏడవడం, బొడ్డు కూడా కత్తిరించక పోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, అ యినప్పటికీ వైద్యం అందిస్తామని, పోలీ సుల కు సమాచారమిచ్చామని కోటిరెడ్డి తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 12:31 AM