ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగస్టు 1 నుంచి ఆటోమ్యుటేషన్‌

ABN, Publish Date - Jul 27 , 2025 | 01:35 AM

ఇళ్లు,ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే యజమాని పేరున ఆస్తి బదలాయింపు (మ్యుటేషన్‌) ఆటోమెటిక్‌గా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెం కటరమణ తెలిపారు.

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్‌ వెంకటరమణ

రాజమహేంద్రవరం సిటీ,జూలై 26 (ఆ ంధ్రజ్యోతి) : ఇళ్లు,ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే యజమాని పేరున ఆస్తి బదలాయింపు (మ్యుటేషన్‌) ఆటోమెటిక్‌గా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెం కటరమణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యా లయంలో సచివాలయాల అడ్మిన్లకు ఆటో మ్యుటేషన్‌ విధానంపై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోమ్యుటేషన్‌ విధానాన్ని వచ్చే నెల 1 నుంచి అమలు చేస్తుందన్నారు. ఎసె స్‌మెంట్‌ నెంబరు కలిగి ఆస్తి మొత్తంగా అమ్మకం జరిగిన ఇళ్లు, ప్లాట్లకు ఈ విధానం వర్తిస్తుందన్నారు. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆరంభం కాగా నే ఆ వివరాలు కార్పొరేషన్‌ ఈఆర్‌పీ ఆన్‌లైన్‌ విధానంతో అనుసంధానమై పన్ను వివరాలు పరిశీలించి బకాయిలు ఉంటే అవి చెల్లించిన పిదప ఆటోమ్యుటేషన్‌ సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుందన్నారు. దీని ద్వారా ఆస్తి పన్ను బదలాయింపు మార్గం సులభతర మవుతుందన్నారు. జిల్లా రిజిస్ట్రార్‌ సత్యనారాయణ మాట్లాడుతూ వినూత్న డిటిటల్‌ విధానాన్ని మునిసిపల్‌, రిజిస్ట్రేషన్‌ శాఖలు సంయుక్తంగా అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు.ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా 17 నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు రిజిస్ట్రేషన్‌ స్టాంపుల శాఖ సిద్ధమైందని చెప్పారు. ఖాళీ స్థలం కొనుగోలు చేసినా ఇదే విధానంలో మ్యుటేషన్‌ జరుగుతుందన్నా రు. అయితే యజమాని అప్పటికే వేకెంట్‌ ల్యాం డ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తుండాలని చెప్పారు.కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు సిహెచ్‌.శ్రీనివాసరావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 01:35 AM