ఉగ్రవాదుల దాడికి నిరసనగా మానవహారం
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:09 AM
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సోమేశ్వరం గ్రామంలో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యం లో నిరసన, మానవహారం నిర్వహించారు.
రాయవరం, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి): పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సోమేశ్వరం గ్రామంలో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యం లో నిరసన, మానవహారం నిర్వహించారు. సీఐటీయూ మండల కన్వీనర్ డి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ జమ్ము-కాశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు దాడిచేసి హతమార్చడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉగ్రవాదులకు కేంద్రం గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యవేణి, కమల, అరుణ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘ నాయకురాలు త్రివేణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:09 AM