ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి ఆర్మీ ర్యాలీ

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:49 AM

కాకినాడ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాకినాడలో క్రీడామైదానం వద్ద ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం సాఫీగా మారిన రోడ్డు, పక్కన బారికేడ్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్టీఆర్‌ జిల్లా వరకు 12 జిల్లాల నుంచి అభ్య ర్థులు ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆర్మీ ఎంపిక పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇక్కడ దేహదారుఢ్య పరీక్ష, 1.6 కి.మీ రన్‌, మెడికల్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ టెస్టులు, లాంగ్‌జంప్‌, పుల్‌ అప్స్‌, నైన్‌ ఫీట్‌ డిచ్‌ అండ్‌ జిగ్‌జాగ్‌ ఇలా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అనేక రకాల ఈవెంట్లు జరగనున్నాయి. రోజుకు 600 నుంచి 800 మంది రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటారు. అభ్యర్థులకు ముందుగా నెంబర్లు కేటాయించి, వందమంది చొప్పున 1.6 కి.మీ రన్నింగ్‌ పరీక్ష, అనంతరం మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తా రు.20 రోజులపాటు జరిగే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో 15 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. ఆర్మీ అభ్యర్థులకు స్పోర్ట్స్‌ అఽథారిటీ ఆవరణలోనే వసతి కల్పించనున్నారు. తొలి రోజు 5వ తేదీ అంటే 4వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభయ్యే ర్యాలీలో తొలిరోజు 600 మంది పాల్గొననున్నారు. రెండో రోజు ఆరో తేదీ (ఐదో తేదీ అర్ధరాత్రి) మరో 671 మంది, 7,8,9 తేదీల్లో వరుసగా మూడు రోజుల్లో రోజుకు 800 మంది చొప్పున అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటారు. 10వ తేదీన విరామం. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రోజుకు 800 మంది పాల్గొంటారు. 15వ తేదీ స్వాతంత్య్రం దినోత్సవం రోజున సెలవు ప్రకటించారు. 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరగనుంది. 20న రెస్ట్‌ డేతో మొత్తం ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

జిల్లాల వారీగా ర్యాలీ షెడ్యూల్‌ ఇలా..

ఆగస్టు 5వ తేదీ : అల్లూరి జిల్లా, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌

ఆగ స్టు 6, 7, 8 : అనకాపల్లి

ఆగస్టు 7 : యానాం

ఆగస్టు 8, 9 : పార్వతీపురం

ఆగస్టు 9, 11 : విశాఖపట్నం

ఆగస్టు 11, 12, 13, 14, 16 : శ్రీకాకుళం

ఆగస్టు 16, 17, 18, 19 : విజయనగరం

ఆగస్టు 19 : కాకినాడ జిల్లా

Updated Date - Aug 04 , 2025 | 12:49 AM