టిడ్కో గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి.. లబ్ధిదారులకు ఇవ్వాలి
ABN, Publish Date - Jul 17 , 2025 | 01:08 AM
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాల న్నింటినీ వచ్చే డిసెంబర్‌కి పూర్తి చేసి లబ్ధి దా రులకు ఇవ్వాలని జిల్లా ఇనచార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అం దించేందుకు తగిన కార్యాచరణ చేయాలన్నా రు.
జిల్లా ఇనచార్జి మంత్రి నారాయణ
ఫేక్ ఇళ్ల పట్టాలపై తక్షణమే విచారణ చేయాలి: ఎమ్మెల్యేలు
ఖరీఫ్ సాగు కు తక్షణమే సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే జ్యోతుల
కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం
కలెక్టరేట్(కాకినాడ),జూలై16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాల న్నింటినీ వచ్చే డిసెంబర్‌కి పూర్తి చేసి లబ్ధి దా రులకు ఇవ్వాలని జిల్లా ఇనచార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అం దించేందుకు తగిన కార్యాచరణ చేయాలన్నా రు. గత ప్రభుత్వం టిడ్కోగృహాలు నిర్మించకుం డానే లబ్ధిదారుల పేరిట రూ.140కోట్లు రుణా లు తీసుకుని వాటిని డైవర్ట్ చేయడంవల్ల అవి బ్యాంకులకు ఎనపీఏలుగా మారాయన్నారు. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించి ఆ గిపోయిన టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ షానమో హన మాట్లాడుతూ జిల్లాలో 1,02,450 బంగా రు కుటుంబాలను గుర్తించగా వచ్చే ఆగస్టు 15 నాటికి వీరిలో 80,158 కుటుంబాలను మా ర్గదర్శులుగా దత్తత స్వీకరించే లక్ష్యాన్ని ప్ర భుత్వం నిర్దేశించిందన్నారు. స్వర్ణాంధ్ర పీ4 కార్యక్రమం కింద ఈనెల 17 నుంచి ఆగస్టు 5 వరకు గ్రామ,వార్డు సభల్లో బంగారు కుటుం బాల వాలిడేషన నిర్వహిస్తామన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో మాస్టర్ ట్రైనీలు, సర్వేయర్ల శిక్షణా కార్యక్రమాలు, 21 నుంచి ఆగస్టు 6 వ రకు బంగారు కుటుంబాల అవసరాల సర్వే నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,844 బంగారు కుటుంబాలను మార్గదర్శకు లు దత్తత స్వీకరించారని తెలిపారు. జిల్లాలో గ్రామస్థాయినుంచి జిల్లాస్థాయి వరకు ప్రభు త్వఉద్యోగులు మార్గదర్శులుగా 10వేల కుటుం బాలను దత్తత చేపట్టే కార్యక్రమం జరుగు తుందన్నారు. జిల్లాలో 47వేలమంది రైతులు 21,400 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేప ట్టేలా ప్రోత్సహించామన్నారు. 69వేల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసే లక్ష్యంతో ఇప్పటివరకు 23,636మందికి కార్డు లు జారీ చేశామన్నారు. దీనిలో 1914 మంది రైతులు పంట రుణాలు పొందారన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ కింద ఇప్పటివరకు 6218 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన 1799 రూఫ్ టాప్ యూనిట్ల స్థాపన జరిగిందన్నారు.పీఎం కుసుమ్ పథకం కింద రైతు వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్ ద్వారా 42.43 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు 189 ఎకరాల స్థలం సేకరించామన్నారు. ఏలేరు రిజర్వాయరులో తగినంత నీటి నిల్వలు లేని కారణంగా శివారు ప్రాంతాలకు నీరు చేరడం లేదన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పురు షోత్తపట్నం, పుష్కర్ లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఏలేరు, పీబీసీకి సరఫరా చేస్తామని వెల్లడిం చారు. ఆగస్టు ఒకటి వరకు ఆగకుండా వెంట నే నీటిని లిఫ్ట్‌చేస్తే రైతులు అదను దాటిపో కుండా ఖరీఫ్ నారుమళ్లు చేపడతారని జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. దీంతో సత్వరం నీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇనచార్జి మంత్రి నారాయణ ఇరిగేషన అధికారులను ఆదేశించా రు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పీ4లో చైతన్య వంతమైన భాగస్వామ్యం కావాలన్నారు.
వేరే స్థలం కేటాయించాలి
గత ప్రభుత్వంలో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో లబ్ధిదారులకు స్థలాలు కేటా యించారని, దీనివల్ల చాలామంది లబ్ధిదారు లు ఇళ్లు నిర్మించుకోలేదని కొందరు ఎమ్మెల్యే లు సమావేశంలో మంత్రి దృష్టి తీసుకొచ్చారు. అలాంటి వారికి పోలవరం స్పాయిల్ ల్యాండ్స్ లో స్థలాలను కేటాయించేందుకు పరిశీలించా లన్నారు. ఆనలైనలో పేర్లు లేకపోయినా, స్థలం కేటాయించకుండా, అధికారులకు తెలియకుం డా గత ప్రభుత్వం జారీ చేసిన ఫేక్ పట్టాల పై విచారణ చేయాలని కోరారు. పట్టణాల్లో ఎ దుర్కొంటున్న డింపింగ్ యార్డు సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
పెద్దాపురం సిల్క్స్ ఎంపికపై అభినందన
వనడిసి్ట్రక్ట్ వనప్రొడెక్ట్ పథకం కింద పెద్దా పురం సిల్క్ చీరలు ఎంపికైనందుకు అధికారు లను, నేతన్నలను మంత్రి నారాయణ అభినం దించారు. కలెక్టర్ షానమోహన తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలను కమిటీకి వివరించారు. అజెండా అంశాల్లో జీరో పావర్టీ, పీ4 కార్యక్రమం అమలు ప్రగతిని వివరించా రు. ప్రభుత్వ విప్‌లు దాట్ల సుబ్బరాజు, యన మల దివ్య, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబ త్తుల రాజశేఖరం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మ కాయల చినరాజప్ప, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన చైర్మన తోట సుధీర్, జిల్లా జేసీ రాహుల్‌మీనా, కాకినాడ కార్పొరేషన కమిషనర్ భావన, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన వర్మ, పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇనచార్జి మర్రెడ్డి శ్రీని వాస్, టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబి, వీవై దాసు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశా నికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇనచార్జి మంత్రి నారాయణకు కలెక్టర్ షాన మోహన, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జేసీ రాహుల్‌మీనా, డీఆర్‌వో వెంకట్రావు ఘన స్వాగతం పలికారు.
యోగాంధ్ర విజేతలకు అభినందనలు
యోగాంధ్ర పోటీల్లో భాగంగా విజయవాడ, విశాఖపట్నంల్లో నిర్వహించిన పోటీల్లో విజేత లను మంత్రి నారాయణ అభినందించారు. కా కినాడ కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన కార్య క్రమంలో మంత్రి నారాయణతోపాటు కలెక్టర్ షానమోహన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విజేతలను అభినం దించారు. ఆంధ్రప్రదేశ యోగా విద్యాపీఠం రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎస్ నాయకర్ జూనియర్ కళాశాల సివిక్స్ అధ్యాపకులు చిట్టూరి చిట్టి బాబుతో కూడిన యోగా బృందాన్ని ప్రత్యేకం గా అభినందించారు. రాష్ట్ర యోగా పోటీల్లో విజేతలుగా డి.దుర్గశాంత ప్రసాద్, సయ్యద్ యాసిన మొహిద్దీన, ఎం.సత్తిబాబే, కె.ఆదిత్య, కేవీవీ శివసాయిరామ్, జి.లహరి దుర్గ, ఆర్ చైత్రశివ వాసుకి, జి.దివ్వాంజలి, బి,లక్ష్మీలు ఉన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 01:08 AM