నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలి
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:36 AM
జీజీహెచ్(కాకినాడ) జూలై 14 (ఆంధ్రజ్యోతి) కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అనుబంధమైన జీజీహెచ్‌లో పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అటెండె ంట్, టెక్నీషియన్, మరో ఇద్దరిని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వానికి సూచిస్తామని రాష్ట్ర మహిళా క
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
బాధిత విద్యార్థినులతో సమావేశం
జీజీహెచ్(కాకినాడ) జూలై 14 (ఆంధ్రజ్యోతి) కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అనుబంధమైన జీజీహెచ్‌లో పారా మెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అటెండె ంట్, టెక్నీషియన్, మరో ఇద్దరిని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వానికి సూచిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఆమె సోమవారం మధ్యాహ్నం రంగరాయ కళాశాలను సం దర్శించి బాధిత విద్యార్థినులను కలిసి వారి పట్ల అటెండెంట్, టెక్నిషీయన్‌లు పాల్పడిన అకృత్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు నిర్భ ంయంగా వివరాలను తెలియజేసేందుకు కళాశాల ఆడిటోరియంలోని ప్రత్యేక గదిలో ఇతరులు ఎవరినీ అనుమతించకుండా బాధిత విద్యార్థిను లతో డాక్టర్ శైలజ ఏకాంత సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.విష్ణువర్ధన్, అధ్యాపకులు, ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ సభ్యులతో కూడా సమావేశమై భవిష్యత్తులో వి ద్యార్థినుల పట్ల అనుచిత వ్యవహారాల నిరోధానికి చేపట్టవల్సిన చర్యలను సూచించారు.
అత్యంత హేయమైన చర్య
అనంతరం శైలజ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎంసీ పారా మెడికల్ విద్యార్థినులపై జరిగిన దురాగతాల పట్ల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశా రు. చదువుకునేందుకు సుదూర ప్రాంతాల నుం చి వచ్చిన పేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలు, యువతలు లైంగిక వేధింపులతో మా నసికంగా క్షోభకు గురికావడం బాధాకరమన్నా రు. న్యాయం జరుగుతుందో లేదోనన్న సంశ యం, పరీక్షలో ఫెయిల్ చేస్తారేమో, శిక్షణలో ఇ బ్బందులు కలిగిస్తారేమోనన్న భయాలతో వేధింపులకు గురైన విద్యార్థినులు, ఉద్యోగినులు పై అధికారులకు ఫిర్యాదు చేయకుండా మౌనంగా వారిలో వారే కుమిలిపోతున్నారన్నారు. తమ ప ట్ల జరిగిన ఆకృత్యాలు మరొకరికి జరగకూడదని ధైర్యంగా ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థినులను చైర్‌పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాలకు అనుబంధంగా జీజీహెచ్‌లో పనిచేస్తున్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్‌చక్రవర్తి, టెక్నిషియన్‌లు బి.జిమ్మిరాజు, ప్రసాద్, గోపాల్‌కృష్ణ జుగుప్సాకరమైన రీతిలో విద్యార్థినుల ఫోటోలు తీసి వన్‌టై మ్ యూజ్ మోడ్‌లో మెస్సేజ్‌లుగా పంపి పైశాచిక ఆనందం పొందుతూ మానసిక వేదనకు గు రి చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు.
విచారణలో విస్తుపోయే నిజాలు
అలాగే నలుగురు నిందితులపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయన్నారు. ఆ నలుగురు గతంలో కూడా జీజీహెచ్‌కు వచ్చే మ హిళా రోగులు, వారి బంధువుల పట్ల లైంగిక వే ధింపులకు పాల్పడేవారని విద్యార్థినులు తనకు వివరించారన్నారు. దీనిపై 60మంది విద్యార్థిను లు ఈ నెల 8న బయోకెమిస్ర్టీ విభాగాధిపతికి ఫిర్యాదు చేసి 9వ తేదీన ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డా క్టర్ విష్ణువర్ధన్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశా రన్నారు. ఈ ఫిర్యాదులపై కళాశాల ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటి విచారించి కమిటి సమర్పించిన నివేదిక ఆధారంగా నిందితులు నలుగురిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారన్నారు. బాధిత విద్యార్థినులలో మైనర్‌లు కూడా ఉన్నందున నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారన్నారు. నిందితులు తాము రెగ్యులర్ ఉద్యోగులమని, తమను ఎవరూ ఏమి చేయలేరనే దీమా తో ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డారని ఇటు వంటి వారందరికి గట్టి హెచ్చరికగా నలుగురిని ఉద్యోగ విధుల నుంచి పూర్తిగా తొలగించాలని మహిళా కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు. బాధిత విద్యార్థినులను కళాశాలలో, జీజీహెచ్‌లో అధికారులు లేదా సిబ్బంది ఎవ రైనా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. మహిళల రక్షణకు కళాశాలలు, కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లయి ంట్స్ కమిటీపై విద్యార్థినులకు, ఉద్యోగినులకు అవగాహన కల్పించి వారిలో ధైర్యంతో పాటు భరోసా కల్పించాలని చైర్‌పర్సన్ అధికారులను కోరారు. తమ పట్ల జరిగే లైంగిక అకృత్యాలను ఎదురించే ధైర్యాన్ని ఆడబిడ్డల్లో తల్లిదండ్రులు పె ంపొందించాలని డాక్టర్ శైలజ కోరారు. అనం తరం సఖి వన్‌స్టాప్ సెంటర్‌ను సందర్శించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా, కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌దేవరాజ్ పాటిల్, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఐసీడీఎస్ పీడీ సీహెచ్‌ఎస్‌కే దుర్గాదేవి, జీజీహెచ్ సూపరిండెంటెంట్ డాక్టర్ లావణ్యకుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డిప్యూటీ సూపరిండెంటెంట్ డాక్టర్ పద్మనాభన్ శ్రీనివాసన్, ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:36 AM