ఆనంద హరితం!
ABN, Publish Date - Jul 19 , 2025 | 01:41 AM
కూటమి ప్రభుత్వం మరో హామీ నెరవే ర్చింది.. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారిగా పెంచిన హరిత పన్ను వాహనదా రుల తలకు మించిన భారమైంది. రోడ్డెక్కిన ప్రతి వాహనం నుంచి డబ్బులు గుంజేసింది. వందల్లో ఉండే గ్రీన్‌ట్యాక్స్‌ను వేలల్లో పెంచింది.. పర్యా
నెరవేరిన మరో హామీ
గ్రీన్‌ట్యాక్స్ తగ్గింపు
వైసీపీలో రూ.20 వేలు
ప్రస్తుతం రెండు స్లాబ్‌లు
రూ.1500, రూ.3 వేలు
సర్కారు ఉత్తర్వులు జారీ
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం మరో హామీ నెరవే ర్చింది.. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారిగా పెంచిన హరిత పన్ను వాహనదా రుల తలకు మించిన భారమైంది. రోడ్డెక్కిన ప్రతి వాహనం నుంచి డబ్బులు గుంజేసింది. వందల్లో ఉండే గ్రీన్‌ట్యాక్స్‌ను వేలల్లో పెంచింది.. పర్యావరణం పేరుతో పది టన్నుల లారీలపై రూ.ఐదు వేలు, 30 టన్నుల లారీలపై రూ.15 వేలు విధించడంతో లారీ యజమాను లు గగ్గోలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఈ ట్యాక్స్ తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూట మి ప్రభుత్వం వచ్చాక హరిత పన్ను విషయమై లారీ యజమానుల వినతిని సర్కారు పరిశీలించింది. (గ్రీన్ ట్యాక్స్) హరితపన్ను భా రాన్నితగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వైసీపీలో పిండుడే..
గత ప్రభుత్వంలో వివిధ వాహనాలకు ఏటా గరిష్టంగా రూ.20 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ విధించగా కూటమి ప్రభుత్వం దీనిని సవరించి ఏడాదికి రూ.1500, రూ.3000 చొప్పున రెండు శ్లాబుల్లో వసూలు చేసేలా కొత్త విధానం తెచ్చింది. సరకు రవాణా (లారీలు, వ్యాన్లు), ప్రజా రవాణా (బస్సులు, మినీ బస్సులు) ఏడేళ్ల తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలంటే ఏటా హరిత పన్ను చెల్లించాలి. గతంలో ఈ పన్ను కేవలం రూ.200 మాత్రమే ఉండేది. కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని దీనిని పెంచుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీనిని ఆసరాగా తీసుకున్న జగన్ ప్రభుత్వం 2022 జనవరి నుంచి రాష్ట్రంలో హరిత పన్నును భారీగా పెంచింది. ఏడు నుంచి పదేళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను విలువ, పదేళ్ల నుంచి 12 ఏళ్ల నాటికి ఒక త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్లు దాటితే రెండు త్రైమాసిక పన్నుల విలువ మేర చెల్లించేలా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయా వాహనాల కేటగిరీ, వాటి వయసు బట్టి కనిష్ఠంగా రూ.800 మొదలుకొని గరిష్ఠంగా రూ.20 వేల వరకు ఏటా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. లారీలు, టిప్పర్ల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసింది. పాసింజర్ వాహనాలు, స్కూలు, కాలేజీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, ఓమ్నీ బస్సులు వంటి వాటికి రూ.ఆరు వేలు, చివరికి ఆటోలు, బైక్‌లు, క్రేన్ లు, ట్రాక్టర్లపైనా భారీగా పన్ను పెంచారు. పన్ను భారం భరించలేక వీరంతా ఆందోళన లు చేశారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో 55 వేల వరకు లారీ లు ఉండగా, వీటిపై కోట్లలో పన్ను భారం పడింది. కాకినాడ జిల్లాలో 2.94 లక్షలు, తూ ర్పుగోదావరి జిల్లాలో 2.10 లక్షలు, కోనసీమ జిల్లాలో 1.80 లక్షల వాహనదారుల నుంచి జగన్ ప్రభుత్వం హరిత పన్ను పిండేసింది.
జిల్లాల్లో తగ్గనున్న భారం
ప్రస్తుతం హరిత పన్నుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రూ.24.10 కోట్ల వరకు ఉమ్మడి జిల్లా వాహనాలపై పన్నుభారం తగ్గ నుంది. అత్యధికంగా కాకినాడ జిల్లాలో 2.94 లక్షల వాహనాలపై రూ.9 కోట్లు, తూర్పుగోదావరిజిల్లాలో 2.10 లక్షల వాహనాలపై రూ.8.10 కోట్లు, కోనసీమలో 1.80 లక్షల వాహనాలపై రూ.ఏడు కోట్ల పన్ను భారం తగ్గనుంది.
Updated Date - Jul 19 , 2025 | 01:41 AM