చంద్రబాబు.. నేడు కోనసీమకు..
ABN, Publish Date - May 31 , 2025 | 12:54 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జరపనున్న పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. హెలిప్యాడ్‌తోపాటు రహదారులు అభివృద్ధి, సీఎం పాల్గొనే రెండు ప్రాంతాల్లో బహిరంగ సభలకు భారీ వేదికలు సిద్ధమయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు పూడికతీత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం
సీఎం పాల్గొనే రెండు సభా వేదికలను సిద్ధంచేసిన అధికారులు
సీఎం కాన్వాయ్ ట్రయల్‌రన్.. పరిశీలించిన డీఐజీ అశోక్‌కుమార్
700 మందితో పోలీసు పటిష్ట బందోబస్తు
ఆరు గంటల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
అమలాపురం/ముమ్మిడివరం, మే 30(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జరపనున్న పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. హెలిప్యాడ్‌తోపాటు రహదారులు అభివృద్ధి, సీఎం పాల్గొనే రెండు ప్రాంతాల్లో బహిరంగ సభలకు భారీ వేదికలు సిద్ధమయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువు పూడికతీత పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఆరు గంటలపా టు రెండు గ్రామాల్లో జరిగే సీఎం పర్యటనకు అనూహ్యమైన రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సీఎం కాన్వాయ్‌తో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు సభావేదికల వద్ద భారీ సామర్థ్యం కలిగిన జనరేటర్లను ఏర్పాటుచేశారు. ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కూలర్లు, ఏసీలు ఏర్పాటుచేశారు. తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వంటివి ప్రజల కోసం సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా సీఎం చంద్రబాబు శనివారం నాటి పర్యటనకు సంబంధించి కాన్వాయ్ ట్రయల్ రన్‌ను అధికారులు పకగ్బందీగా నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమై సత్తెమ్మతల్లి గుడి మీదుగా చెయ్యేరు గున్నేపల్లి, చెయ్యేరు వరకు నిర్వహించారు. సీఎం పాల్గొనే కార్యక్రమాల వద్ద కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, మంత్రి సుభాష్, సీఎం పర్యటన కమిటీ సారధి పెందుర్తి వెంకటేష్, పలువురు నేతలు ట్రయల్ రన్‌లో పాల్గొన్నారు. తర్వాత కొన్ని సూచనలు చేసి, వాటిని సరిదిద్దాలని అధికారులను ప్రజాప్రతినిధులు కోరారు.
చంద్రబాబు పర్యటన సాగేదిలా..
సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్పమార్పులు జరిగాయి. ఆ ప్రకా రం.. శనివారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లి లోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 11.45 గంటలకు కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సత్తెమ్మతల్లి ఆలయ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 11.45 గంటల నుంచి 12.10 గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో పరస్పర సంభాషణలు ఉంటాయి. 12.10 గంటలకు బయలుదేరి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి రోడ్డు మార్గాన బయలుదేరతారు. 12.15 గంటల నుంచి 45 నిమిషాలపాటు పేదల సేవలో కార్యక్రమం బంగారు కుటుంబం(పీ4)లో భాగంగా గ్రామస్తులు కొందరిని దాతలు దత్తత తీసుకుంటారు. అలాగే ఉపాధి పథకం కింద చేపట్టే చెరువు పూడికతీత పనుల పరిశీలన, కార్మికులతో సమావేశం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి చెయ్యేరులో ప్రజావేదిక జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. 1.05 గంటల నుంచి 2 గంటల వరకు సమయాన్ని రిజర్వు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు స్థానిక ప్రజలతో ప్రజావేదికలో ముఖాముఖి సమావేశమవుతారు. 3.30 గంటలకు ప్రజావేదిక నుంచి బయలుదేరి సీహెచ్ గున్నేపల్లి వద్దనున్న టీడీపీ కేడర్ సమావేశ వేదికకు చేరుకుంటారు. 3.35 గంటల నుంచి 5.05 గంటల వరకు కేడర్ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి 5.10 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలిప్యాడ్‌కు నుంచి బయలుదేరి ఆరు గంటలకు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.
Updated Date - May 31 , 2025 | 12:54 AM