ప‘రేషన్’.. పడొద్దు
ABN, Publish Date - May 21 , 2025 | 01:18 AM
ఎండీయూ వాహన సేవలకు ప్రభుత్వం మంగళం పాడేసింది.పేదలకు బియ్యం పంపిణీ పేరుతో నాలుగున్నరేళ్లు వైసీపీ సేవలో తరిం చిన వాహనాలు ఇకపై రద్ద య్యాయి. ఇన్నేళ్లు కొనసాగుతున్న దందాకు ప్రభుత్వం చెక్ పెట్టిం ది. రేషన్ బియ్యం ఇకపై రేషన్ దుకాణాల్లోనే తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర క్యాబి నెట్ మంగళవారం నిర్ణయం ప్రకటించింది.
ఇకపై ఎప్పుడు కావాలంటే అప్పుడే రేషన్
ఇక అక్రమాలకు బ్రేక్
ఎండీయూ వాహన సేవలు రద్దు
క్యాబినెట్‌లో నిర్ణయం
ఉమ్మడి జిల్లాలో 1,139 వినియోగం
రూ.66.19 కోట్లతో కొనుగోలు
ఇంకా 20 నెలల రుణం బాకీ
2,857 దుకాణాల్లో రేషన్
(కాకినాడ/అమలాపురం-ఆంధ్రజ్యోతి)
ఎండీయూ వాహన సేవలకు ప్రభుత్వం మంగళం పాడేసింది.పేదలకు బియ్యం పంపిణీ పేరుతో నాలుగున్నరేళ్లు వైసీపీ సేవలో తరిం చిన వాహనాలు ఇకపై రద్ద య్యాయి. ఇన్నేళ్లు కొనసాగుతున్న దందాకు ప్రభుత్వం చెక్ పెట్టిం ది. రేషన్ బియ్యం ఇకపై రేషన్ దుకాణాల్లోనే తెచ్చుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర క్యాబి నెట్ మంగళవారం నిర్ణయం ప్రకటించింది.
అక్రమాలకు బ్రేక్ వేశారు..
నెలలో తమకు కావాల్సిన సమయంలో కార్డుదారులు రేషన్‌దుకాణానికి వెళ్లి తెచ్చుకునే అవకాశం అమలవుతుండగా..గత వైసీపీ ప్రభు త్వం తూట్లు పొడిచింది. కార్దుదారులకు నరకం చూపించింది. తొలుత ఇంటింటికి బియ్యం పం పిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆనక మాట మార్చేసింది. ఒక కాలనీకి వెళ్లి ఈ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనం సైరన్‌తో ప్రదర్శిస్తే గంటల తరబడి ఆ కాలనీ వాసులు వాహనం ఎదుట నిలబడి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితికి తెచ్చింది. ఆ రోజు వాహనం వద్దకు వెళ్లకపోతే ఆ నెల బియ్యం పోయినట్టే.ఈ వాహనం పేరుతో సదరు ఆపరే టర్లు కార్డుదారులపై రుబాబు చేసేవారు. బి య్యం ఇచ్చినట్టే ఇచ్చి అక్కడే తిరిగి కొనుగోలు చేసేవారు.ఆ బియ్యం తిరిగి వైసీపీ నేతల కను సన్నల్లో నడిచే రేషన్ మాఫియాకు ఈ వాహ నాలు తరలించేవి.ఇదే విషయాన్ని మంగళవా రం నాటి క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు.దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ఎం డీయూ వాహనాలను రద్దు చేసింది.
కోట్లలో దుర్వినియోగం..
గత వైసీపీ ప్రభుత్వం సొంత ప్రచారానికి రేషన్‌దుకాణాలను నిర్వీర్యం చేసి ఈ ఎండీ యూ వాహనాలను రుద్దింది. ఒక్కో వాహనాన్ని రూ.5.81 లక్షల చొప్పున బ్యాంకు రుణంపై కొను గోలు చేసి ఆపరేటర్లకు అందించింది. మొత్తం 72 నెలల వాయిదాపై బ్యాంకు నుంచి 2021 ఫిబ్రవరిలో రుణం తీసుకుంది.కాకినాడ జిల్లాలో 420, తూర్పుగోదావరి జిల్లాలో 364, కోనసీమ జిల్లాలో 355 వాహనాలను బ్యాంకు నుంచి రూ.66.19 కోట్ల రుణం ద్వారా కొనుగోలు చేసిం ది.ఇప్పటికీ ఈ రుణాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది.ఇంకా ఇరవై నెలల బాకీ బ్యాంకుల్లో ఉంది. ఇప్పుడు ఈ వాహనాలను రద్దు చేసిన నేపథ్యంలో రూ.6.83 కోట్లు అప్పు తీర్చాల్సి ఉంది. ఈ ఎండీయూ వాహనాలను నడుపుతున్న వ్యక్తుల ఉపాధికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారికి ఆ వాహనాలను ఉచితంగానే అప్పగించడం ద్వారా ఎండీయూ వాహనాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
1 నుంచి దుకాణాల వద్దే..
లబ్ధిదారులకు బియ్యం, నిత్యావసరాలు అందించేందుకు గతంలో ఉండే చౌక డిపోల వ్యవస్థను జూన్ 1వ తేదీ నుంచి తిరిగి పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్డుదారులు నేరుగా తమ పరిధి లోని రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోవచ్చని తెలిపింది. కాకినాడ జిల్లాలో 1,060 రేషన్ దుకా ణాల్లో 6.43 లక్షల మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోనసీమ జిల్లాలో 926 రేషన్ దుకాణాల్లో 5.38 లక్షల మంది కార్డుదా రులు, తూర్పుగోదావరి జిల్లాలో 871 దుకాణాల ద్వారా 5.65 లక్షల మంది కార్డుదారులకు ప్రభు త్వం నెలకు ఉమ్మడి జిల్లాలో 26 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. ఇకపై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ సమయంలోనైనా లబ్ధిదారుడు చౌక దుకాణం వద్దకు వెళ్లి నేరుగా బియ్యంతో సహా ఇతర నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఉంది. దీనికితోడు దివ్యాంగులు, వృద్ధులకు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టనుంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా చౌకడిపో డీలర్లు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 21 , 2025 | 01:18 AM