అంతర్వేది ఆలయ భూములపై కమిటీ
ABN, Publish Date - Apr 19 , 2025 | 01:01 AM
అంతర్వేది దేవస్థానం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములకు సంబంధించి ఐదు శాఖలతో కూడిన కమిటీని అమలాపురం ఆర్డీవో ఏర్పాటు చేశారని ఏసీ వి.సత్యనారాయణ తెలిపారు.
అంతర్వేది, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): అంతర్వేది దేవస్థానం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములకు సంబంధించి ఐదు శాఖలతో కూడిన కమిటీని అమలాపురం ఆర్డీవో ఏర్పాటు చేశారని ఏసీ వి.సత్యనారాయణ తెలిపారు. దేవదాయశాఖ, రెవెన్యూ, మత్స్యశాఖ, వ్యవసాయశాఖ, మండల పరిషత్‌ల సంయుక్త నిర్వహణలో భూసర్వే నిర్వహించాలని ఆమె ఆదేశించారన్నారు. అంతర్వేది, శృంగవరప్పాడు, గొంది, కేశవదాసుపాలెం గ్రామాల్లో 726.97 ఎకరాల భూమి ఉందన్నారు. రైతుల నుంచి శిస్తు వసూలుకు, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి 358.56 ఎకరాల భూమి ఉందన్నారు. ఈభూముల్లో రైతులకు సంబంధించి శిస్తు వసూలు, పెంపుపై సర్వే నిర్వహిస్తారని తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే భూమి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 01:01 AM