8మంది వేద పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
ABN, Publish Date - Aug 01 , 2025 | 01:18 AM
అన్నవరం దేవస్థానం ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురుయ్యారు. 8మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని దేవస్థానం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8మంది విద్యార్థు లను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ఏరి యా ఆస్పత్రి వైద్యులు వైద్యచికిత్స అంది స్తున్నారు.
గొంతు నొప్పి, కడుపు నొప్పితో ఇబ్బందులు
అన్నవరం దేవస్థానం ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం
మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలింపు
పరిస్థితిపై ఆరా తీసిన డీఎంహెచ్‌వో
అన్నవరం/తునిరూరల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): అన్నవరం దేవస్థానం ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురుయ్యారు. 8మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని దేవస్థానం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి అక్కడినుంచి మెరుగైన వైద్యంకోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8మంది విద్యార్థు లను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ఏరి యా ఆస్పత్రి వైద్యులు వైద్యచికిత్స అంది స్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎం హెచ్‌వో తుని ఏరియా ఆస్పత్రికి తరలివచ్చి మెరుగైన వైద్యసేవలకు సంబంధించి వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ విద్యార్థులు రెండురోజులక్రితం అన్నవరం దేవస్థానం దిగువన కిర్లంపూడి సత్రం లో దత్త హోమంలో పాల్గొని అక్కడ అన్న ప్రసాదం స్వీకరించినట్లు సమాచారం. ఆ అన్నప్రసాదమే వికటించి తీవ్రమైన గొంతు నొప్పి, కడుపు నొప్పితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది.
Updated Date - Aug 01 , 2025 | 01:18 AM