టెంఫుల్‌గా.. పెట్టండి!
ABN, Publish Date - May 13 , 2025 | 01:30 AM
తిరుపతిలో తినలేకపోతున్నాం.. గత ప్రభుత్వంలో ఇదీ భక్తుల మాట.. ప్రభుత్వం మారింది.. అంతే అన్నదానం అమృతమయంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అన్నదాన ప్రసాదాన్ని అమోఘంగా మార్చారు. నాణ్యతగా ఉండేలా చూస్తున్నారు.. ఒక్క తిరుపతిలోనే కాదు.. జిల్లాల్లోని ప్రధాన ఆలయాల్లోనూ నిత్యాన్న దానం చేయాలని తలంచారు.. దీనిలో భాగంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ఆలయాల్లో నిత్యాన్నదానం చేయాలని ఆదేశించారు. అందులో ఒకటి అన్నవరం.. రెండోది వాడపల్లి. అలాగే తలుపులమ్మ లోవ ఆలయంపై నివేదికివ్వాలని సూచించారు. సీఎం ఆదేశాల అమలుకు అధికారులు పరుగులు పెడుతున్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలు
అన్నవరం, వాడపల్లిలో అమలు
ఇప్పటికే వేలాదిమందికి అన్నదానం
మరింత పెంచేందుకు సన్నాహాలు
అన్నవరంలో నిధుల కొరత
వాడపల్లిలో అన్నదానానికి ఓకే
తలుపులమ్మ లోవపై నివేదిక
17న అమరావతిలో సమీక్ష
తిరుపతిలో తినలేకపోతున్నాం.. గత ప్రభుత్వంలో ఇదీ భక్తుల మాట.. ప్రభుత్వం మారింది.. అంతే అన్నదానం అమృతమయంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అన్నదాన ప్రసాదాన్ని అమోఘంగా మార్చారు. నాణ్యతగా ఉండేలా చూస్తున్నారు.. ఒక్క తిరుపతిలోనే కాదు.. జిల్లాల్లోని ప్రధాన ఆలయాల్లోనూ నిత్యాన్న దానం చేయాలని తలంచారు.. దీనిలో భాగంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ఆలయాల్లో నిత్యాన్నదానం చేయాలని ఆదేశించారు. అందులో ఒకటి అన్నవరం.. రెండోది వాడపల్లి. అలాగే తలుపులమ్మ లోవ ఆలయంపై నివేదికివ్వాలని సూచించారు. సీఎం ఆదేశాల అమలుకు అధికారులు పరుగులు పెడుతున్నారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తు లకు పరిమితి లేకుండా నిత్యాన్నదానం అమ లుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ కడుపునిండా భోజనం వడ్డించాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం చంద్రబాబు ఇటీవల దేవదాయశాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఈ రెండు ఆలయాల్లో నిరంతరం భక్తులకు నిత్యాన్నదానం అందుతు న్నా ఇకపై మరింతమందికి భోజనం అందిం చేందుకు అధికారులు కసరత్తు ఆరంభించారు. అన్నవరం దేవస్థానానికి నిధుల కొరత వేధిస్తుం డడం, భోజనశాలలు ఏమాత్రం సరిపోక పోవడంతో దీన్ని ఎలా అమలుచేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. వాడ పల్లికి నిధులు పుష్కలంగా ఉండడంతో పరిమితి లేకుండా మరింత మందికి అన్న దానం అమలుచేయనున్నారు. తుని ని యోజవర్గంలోని తలుపులమ్మ లోవ ఆల యంలో నిత్యాన్నదానం అసలు ఇంతవరకు లేదు. దీంతో త్వరలో అమలుకు వీలుగా సాధ్యా సాధ్యాలపై ప్రభుత్వం నివేదిక కోరింది.
భక్తుల కడుపు నింపండి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాలకు ఉభ య తెలుగు రాష్ట్రాల నుంచి వేలల్లో భక్తులు వస్తుంటారు. ఏటా కోట్లలో విరాళాలు అందు తున్నాయి. ప్రస్తుతం అన్నవరం,వాడపల్లి ఆల యాలకు వేలాదిగా వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందిస్తు న్నారు.అన్నవరం కొండపై నిత్యం నాలుగు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం అమలవుతోంది. వాడపల్లిలో శని,ఆది వారాల్లో 50 వేల వరకు, మిగిలిన రోజు ల్లో 10 వేల మంది వరకు భక్తులకు అన్నదానం అందుతోంది. ఈ రెండు ఆల యాలకు కొన్నేళ్లుగా భారీగా భక్తులు తరలివస్తోన్న నేపథ్యంలో మరింత మందికి పరిమితిలేని విధంగా అన్న దానం అందించా లని సీఎం చంద్రబాబు అధికా రులను ఆదే శించారు.ఈ నెల 6న అన్ని ఆలయాల ఈవోలతో అమరా వతిలో సమీక్షించిన సీ ఎం భక్తులకు ఇబ్బందిలేకుండా అన్న దానం అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ రెండు ఆలయాల్లో భక్తులకు మరింత మందికి అన్న ప్రసాదం అందనుంది.
అన్నవరంలో తర్జనభర్జన..
సీఎం ఆదేశాలను తక్షణం అమలుచేసే విష యంలో అన్నవరం దేవస్థానం అధికారులు తల పట్టుకుంటున్నారు. అన్నప్రసాదం సంఖ్య పెరి గితే ఆర్థిక భారం ఎలా మోయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. 1987లో సత్యదేవా నిత్యన్నదాన ట్రస్ట్ ఏర్పాటుచేశారు. ఈ ట్రస్ట్‌లో రూ.64 కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటి పై ఏటా రూ.4.5 కోట్లు వడ్డీ లభిస్తోంది. సాధారణ రోజుల్లో నాలుగు వేలు, శని, ఆదివారాల్లో 5 వేల నుంచి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. వడ్డన సిబ్బంది జీతభత్యాలతో కలిపితే ఒక్కో భోజనానికి దేవస్థానా నికి రూ.34 వ్యయమవుతోంది. కార్తీకమాసం వంటి పుణ్యమాసాల్లో ఉదయం నుంచి సాయం త్రం వరకు ఉచిత పులిహోర, దద్దోజన ప్రసాదాన్ని అందిస్తున్నారు. వీటి నిర్వహణకు ప్రస్తు తం లభిస్తున్న వడ్డీ డబ్బులు చాలీచాలనట్టుగా ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో ప్రకటనతో పరి మితిలేని నిత్యాన్నదానం ఎలా అమలుచేయాల నేదానిపై ఆలయ అధికారులు మల్లగుల్లాలు ప డుతున్నారు. అన్నవరంలో నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ చేయాలంటే సుమారు రోజుకు 10 వేల మందికి అందించాల్సి ఉంటుంది. పైగా దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న భోజన హాలు చిన్నగా ఉంది. దీంతో నూతన అన్నప్రసాద భవననిర్మాణం ప్రసాద్ స్కీంలో రూ.11.50 కోట్ల తో మంజూరైంది. తీరా పనులు దక్కించుకున్న కాంట్రాక్టరే సింహాచలం ఘటనలో నాసిరకం పనులతో దొరికిపోవడంతో ప్రభుత్వం అతడిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దీంతో అన్నవరం ప్రసాద్ స్కీం పనులు ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. ఖ ర్చులన్నీ దేవదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని అక్కడనుంచి వచ్చే ఆదేశాలకనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.
వాడపల్లిలో ఓకే..
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి గడచిన కొన్నేళ్లుగా వేలల్లో భక్తులు పోటెత్తుతున్నారు. ఈమేరకు ఆల యం లో నిత్యాన్నదానం అమలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అపరిమిత అన్నదానం అమలు చేయాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ సన్నాహాలను అధికారులు ఆరంభిం చారు. తుని నియోజకవర్గంలోని తలుపులమ్మ ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆల య రద్దీ లెక్కలు సీఎం సమీక్షలో అధికారులు ప్రస్తావించారు. ఇక్కడ కూడా అన్నదానం అమ లు చేయాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించా రు. ఈ ఆలయంలో అసలు అన్నదానం అమలు కావడం లేదు. అన్నదానం అమలు సాధ్యాసా ధ్యాలపై తలుపులమ్మ ఆలయ ఈవోను ప్రభు త్వం నివేదిక కోరింది. ఇక్కడకు ఆదివారం 10 వేల మంది వరకు భక్తులు వస్తారని.. మిగిలిన రోజుల్లో వెయ్యి మంది వరకు ఉంటారని అధికా రులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొ న్నారు. పైగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు సొంతంగా ఇక్కడే వండుకుని తినే ఏర్పాట్లతో వస్తారని.. అన్నదానం అవశ్యకత తక్కువేనని తెలిపారు. అయితే లోవలో అన్నదానం అమలు చేయాలా? లేదా? అనేదానిపై ఈనెల 17న అమరావతిలో జరగనున్న సమీక్షలో స్పష్టత రానుంది. ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలు, భోజన నాణ్యతపై తరచుగా ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తోం ది. ఏ మాత్రం నాణ్యతలో తేడా ఉందని ఫిర్యా దులు వచ్చినా ఆలయానికి ఇచ్చే పాయింట్లను తగ్గిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అనేక ఆలయాల్లో అన్న ప్రసాదంలో నాణ్యత రెట్టింపుకావడంతో భక్తులు ఆనందిస్తున్నారు.
Updated Date - May 13 , 2025 | 01:30 AM