సత్యదేవుడి ఆదాయం రూ.2.12 కోట్లు
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:20 AM
అన్నవరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ. 2,12, 38,410 నగదు, 602.5 గ్రాము ల బంగారం, 613.5 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్
అన్నవరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ. 2,12, 38,410 నగదు, 602.5 గ్రాము ల బంగారం, 613.5 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్‌ఏ 87 డాలర్లు, సౌదీ అరేబియా 55 రియల్స్, యుఏఈ 40 దిరహమ్స్, సింగపూర్ 2డాలర్లు లభించాయి. 35 రోజులకు ఈ ఆదాయం సమకూరగా సరాసరిన భక్తులు రోజుకు రూ.6.06 లక్షలు కానుకల రూపంలో సమర్పించారు. లెక్కింపును ఈవో సుబ్బారావు, ఇతర అధికారులు పర్యవేక్షించగా సిబ్బంది, శ్రీహ రిసేవా సభ్యులు లెక్కించారు.
ప్రత్యంగిర హోమం
రత్నగిరి క్షేత్రరక్షకి వనదుర్గ ఆలయంలో బుధవారం అమావాస్య పర్వదినం సందర్భంగా ప్రత్యంగిర హోమం ఘనంగా జరిగింది. ఉదయం 10గంటలకు పండితులు గణపతి పూజతో కార్యక్రమం ప్రా రంభించి ప్రత్యంగిర దేవతను ఆవాహన గావించి హోమములు, జపములు, పారాయణలు నిర్వహించా రు. 11గంటలకు పవిత్ర హో మగుండంలో సుగంధద్రవ్యాలను అర్పించి పూర్ణాహుతి గావించారు. చతుర్వేద పండితుల వేదాశీర్వచనాలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - Jun 26 , 2025 | 12:20 AM