ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘అన్నవరం’లో అవకతవకలు.. ఈవో చర్యలు

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:13 AM

అన్నవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో జరుగుతున్న అవకతవకలు దీనివెనక ఉన్న పాత్రధారులపై చర్యలకు ఈవో వీర్ల సుబ్బారావు ఉపక్రమించారు. ఇటీవల దేవస్థానం శానిటరీ కాంట్రాక్టర్‌ కనకదుర్గ మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ సంస్థ కార్మికులకు పీఎఫ్‌ చెల్లించకుండా

రూ.30 లక్షలు నకిలీ పీఎఫ్‌ చలానాలకు సంబంధించి ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

రూ.84 లక్షల జీఎస్టీ వసూలులో నిర్లక్ష్యం వహించిన నలుగురికి నోటీసులు

అన్నవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో జరుగుతున్న అవకతవకలు దీనివెనక ఉన్న పాత్రధారులపై చర్యలకు ఈవో వీర్ల సుబ్బారావు ఉపక్రమించారు. ఇటీవల దేవస్థానం శానిటరీ కాంట్రాక్టర్‌ కనకదుర్గ మ్యాన్‌పవర్‌ సర్వీసెస్‌ సంస్థ కార్మికులకు పీఎఫ్‌ చెల్లించకుండా రూ.30 లక్షలు నకిలీ చలానాలను అందించి దేవస్థానం నుంచి బిల్లులు పొందడం కార్మికుల ఫిర్యాదుతో విషయం బయటపడింది. దీంతో సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థపై దేవస్థానం ఫిర్యాదుచేయగా దీనిలో బాగస్వామ్యం అయిన దేవస్థానం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పి.వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ మురాలశెట్టి రామకృష్ణను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఈవో ఉత్త ర్వులు జారీ చేశారు. మార్చి నెలలో సూపరెంటెండెంట్‌గా విధులు నిర్వహించి ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న బలువు సత్యశ్రీనివాస్‌కు చార్జిమెమో ఇచ్చారు. దేవస్థానంలో 2023 నుంచి టోల్‌గేట్‌ లీజుదారు నుంచి జీఎస్టీ, లీజు బకాయి సుమారు రూ.84 లక్షలు వసూలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన అప్పటి సూపరెంటెండెంట్‌ కిషోర్‌, ప్రస్తుతం సెలవులో ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌ వోలేటి జగన్నాథానికి చార్జిమెమో, ప్రస్తుత లీజుల విభాగం సూపరెంటెండెంట్‌ పీవీ.రమణ, జూనియర్‌ అసిస్టెంట్‌ వనపర్తి రమేష్‌ను దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆలయ ఈవో ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారగా దేవస్థానం ఉద్యోగుల్లో గుబులు రేకెత్తిస్తోంది.

Updated Date - Jul 26 , 2025 | 12:13 AM