అన్నవరం దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌ను పునఃపరిశీలన చేయాలి
ABN, Publish Date - May 15 , 2025 | 12:31 AM
అన్నవరం, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి ఏటేటా పెరుగుతన్న భక్తుల తాకిడికి అనుగుణంగా చేపట్టాల్పిన అభివృద్ధి పనులకు సంబ ంధించి పాత మాస్టర్‌ప్లాన్‌ను రివైజ్డ్ చేయాలని దేవదాయ కమిషనర్ రామచంద్రమోహ న్ ఆదేశించారు. బుధవారం అన్నవరం దేవస్థానం ఇంజనీరింగ్ అధికా
దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు
ప్రసాద్ స్కీం పనులకు మరోసారి టెండర్లు
విష్ణుసదన్ సత్రం వద్ద నూతనంగా నిర్మించదలిచిన ప్రదేశానికి స్థల పరిశీలన
అన్నవరం, మే 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధికి ఏటేటా పెరుగుతన్న భక్తుల తాకిడికి అనుగుణంగా చేపట్టాల్పిన అభివృద్ధి పనులకు సంబ ంధించి పాత మాస్టర్‌ప్లాన్‌ను రివైజ్డ్ చేయాలని దేవదాయ కమిషనర్ రామచంద్రమోహ న్ ఆదేశించారు. బుధవారం అన్నవరం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్ 20 19లో అప్రూవల్ కాగా దానికి విరుద్ధంగా ప లు నిర్మాణాలను చేపట్టాల్సి వచ్చింది. దీంతో రివైజ్డ్ చేయాలని ఏమేమి నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి అనే అంశాలపై నూతన మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. సీ తారామసత్రం కూల్చివేత, విష్ణసదన్ ఎదురు గా నూతనంగా నిర్మించతలపెట్టిన 128 గదు ల సత్రాన్ని దేవదాయశాఖ చీఫ్‌ఇంజనీర్ స్థల పరిశీలన చేయాలని సూచించారు. ప్రసాద్ స్కీం పనులకు మరోసారి టెండర్లు పిలవడం జరుగుతుందని సూత్రప్రాయంగా తెలిపారు. దేవదాయ కమిషనర్ గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన పలు సూచనలు చేశారు. సమావేశానికి దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజ నీర్లు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు రాంబా బు,ఉదయ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
Updated Date - May 15 , 2025 | 12:31 AM