ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎట్టకేలకు సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద్‌ స్కీం పనులకు టెండర్లు ఖరారు

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:38 AM

అన్నవరం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించనున్న ప్రసాద్‌ స్కీం పనుల టెం డర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. రూ.18.98 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలవగా రాజమహేంద్రవరానికి చెందిన ఒక గుత్తేదారు 3.65 శాతం లెస్‌కు కోడ్‌చేయ

అన్నవరం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించనున్న ప్రసాద్‌ స్కీం పనుల టెం డర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. రూ.18.98 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలవగా రాజమహేంద్రవరానికి చెందిన ఒక గుత్తేదారు 3.65 శాతం లెస్‌కు కోడ్‌చేయడంతో దానిని ఆ మోదించినట్టు టూరిజంశాఖ అధికారులు తె లిపారు. గతేడాది ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఈ పనులను జమ్మూ, కాశ్మీర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించినా పలు కారణాలతో పిలిచిన టెండర్లు రద్దు చేశారు. ఈ నిధులతో టీటీడీ సత్రం కూల్చిన ప్రదేశంలో అన్నదాన భవనం, క్యూకాంప్లెక్స్‌, అధునాతనమైన మరుగుదొడ్లు, రెండు ఎలక్ట్రికల్‌ బస్సులు సమకూరనున్నాయి. ప్రధానంగా అన్నవరం దేవస్థానంలో పూర్తిస్థాయిలో అన్నదాన భవనం లేకపోవడంతో భక్తులు అసంతృప్తి చెందుతున్నా రు. పనులు వేగంగా పూర్తయితే సత్యదేవుడి సన్నిధిలో ఉచిత అన్నదానం కష్టాలు గట్టెక్కనున్నాయి. ఈనెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో పనులు ప్రారంభించేందుకు పర్యాటకశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:38 AM