ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్వేది తీరాన అగ్గిబాట పురుగులు

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:19 AM

అంతర్వేది, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అగ్గిబాట పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీచ్‌లో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, పర్యాటకులు, జాలర్లు, మత్స్యకారులను ఈ పురుగులు తరచూ కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇవి తగిలినా, కుట్టినా ఆ భాగంలో వేడి మంటలు, దురదలు వస్తున్నాయని స్నానమాచరించేవారు వాపోతున్నారు. క్రిమికీటకాలు, అగ్గిబాట అనే విష పురుగులు కుట్టి

సముద్రం ఒడ్డున కనిపించిన అగ్గిబాట పురుగులు

పర్యాటకులను కుట్టడంతో మంటలు, దురదలు

అంతర్వేది, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అగ్గిబాట పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీచ్‌లో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, పర్యాటకులు, జాలర్లు, మత్స్యకారులను ఈ పురుగులు తరచూ కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇవి తగిలినా, కుట్టినా ఆ భాగంలో వేడి మంటలు, దురదలు వస్తున్నాయని స్నానమాచరించేవారు వాపోతున్నారు. క్రిమికీటకాలు, అగ్గిబాట అనే విష పురుగులు కుట్టినప్పుడు దురదలు వస్తున్నాయని పర్యాటకులు వాపోతున్నారు. అంతర్వేది సాగర సంగమం వద్ద జెల్లీ ఫిష్‌లు (అగ్గిబాట) అనే విషపురుగులు రెండు రోజులుగా అధికంగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు సంభవించినా, సముద్రంలో అలజడులు ఏర్పడ్డ ఈ విషపురుగులు ఒడ్డుకు వస్తుంటాయి. వాటిని ఎవరైనా పట్టుకున్నా, అవి మనుషులను కుట్టినా విపరీతమైన మంటలతో కూడిన దద్దుర్లు వస్తుంటాయి. ప్రమాదకర జీవి కానప్పటికీ అవి కుట్టిన చోట కొబ్బరినూనె రాసినా, ఉప్పునీటితో కడిగినా ఉపశమనం కలుగుతుంది. మరీ ఎక్కువగా దద్దుర్లు వస్తే వైద్యులను సంప్రదించాలి. సీ డ్రాగన్‌ ఫిష్‌ అని కూడా మత్స్యకారులు పిలుస్తున్నారు. శనివారం పదిమందిని పైగా కుట్టడంతో పాలకొల్లు, భీమవరం ఆసుపత్రులకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.

Updated Date - Jun 29 , 2025 | 12:19 AM