పట్టుకుంటే.. పది వేలు!
ABN, Publish Date - May 29 , 2025 | 01:38 AM
కడుపు నిండా తిండి పెట్టండి.. కంటిపై కునుకు వేస్తే చితక్కొట్టండి.. ఈ డైలాగు ఏదో ఫేమస్ సినిమాలో విన్నట్టుంది కదూ!.అవును.. విలన్‌ని ఉద్దేశించి పోలీస్ అధికారి ఇచ్చే ఆదేశమది. ఇప్పుడు మందుబాబుల పరిస్థితి కూడా కాస్త అటూ ఇటుగా అలాగే ఉంది. పిచ్చి బ్రాండ్లు.. నాసిరకం మందు.. అధిక ధరలతో ఐదేళ్లు విసిగిపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చినా స్వేచ్ఛగా తాగడానికి వీల్లేక సతమతమైపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్య మైన మద్యం అందు బా టులోకి వచ్చింది. సుమారు 200 బ్రాండ్లు కళ్లెదుట కనబడుతున్నా యి. కానీ చుక్క గొంతులో పోసు కోవడానికి సాహసం చేయాల్సి వస్తోంది.
మందెక్కడ తాగాలి మహాప్రభో
పర్మిట్ రూంలు లేక ఇబ్బంది
బయట తాగితే నేరం..ఫైన్
చుక్క పడాలంటే సాహసమే
ఉమ్మడి జిల్లాలో 455 షాపులు
మందుబాబులు సతమతం
పోలీస్‌ల నిఘాతో గగ్గోలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
కడుపు నిండా తిండి పెట్టండి.. కంటిపై కునుకు వేస్తే చితక్కొట్టండి.. ఈ డైలాగు ఏదో ఫేమస్ సినిమాలో విన్నట్టుంది కదూ!.అవును.. విలన్‌ని ఉద్దేశించి పోలీస్ అధికారి ఇచ్చే ఆదేశమది. ఇప్పుడు మందుబాబుల పరిస్థితి కూడా కాస్త అటూ ఇటుగా అలాగే ఉంది. పిచ్చి బ్రాండ్లు.. నాసిరకం మందు.. అధిక ధరలతో ఐదేళ్లు విసిగిపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చినా స్వేచ్ఛగా తాగడానికి వీల్లేక సతమతమైపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్య మైన మద్యం అందు బా టులోకి వచ్చింది. సుమారు 200 బ్రాండ్లు కళ్లెదుట కనబడుతున్నా యి. కానీ చుక్క గొంతులో పోసు కోవడానికి సాహసం చేయాల్సి వస్తోంది. దీనికి కారణం చుక్క మింగడానికి చోటు లేకపోవడమే. ఇంట్లో అనుమతి ఉండదు.. బయ ట నాలుక తడుపుకుందామంటే నేరం.. బార్‌లకు వెళదామంటే అద నపు ధరలు.. ఎక్కడో చోట ఏదోలా తాగేసి ఇంటికి పోదామంటే నోట్లో గొట్టం పెట్టి ఊద మనే పోలీసులు.. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం నాణ్యమైన సరుకు..సరసరమైన ధ రలు తెచ్చిందని సంతోషించాలా?.. తాగ డానికి జాగా లేదని నొచ్చుకోవాలా అని సగటు మ ద్యం వినియోగదారుడు ప్రశ్నిస్తున్నాడు. విసి గిపోయి పాలకులపై చిందులేస్తున్నాడు.
ఎక్కడ తాగేది?
వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులు క్వార్టరు తాగాలంటే రూ.500 ఆవిరైపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన దరిమిలా మందుబా బులకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అయితే పర్మిట్ రూంలు లేక తాగడానికి ఇబ్బందులు పడుతున్నారు. మద్యం దుకాణాల వద్ద అనధికారికంగా సిట్టింగ్‌లు ఉన్నా బెరుగ్గానే తాగాల్సిన పరిస్థితి ఉంది. బార్‌లకు రెండేళ్ల లైసె న్సును గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చే సింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ బార్‌లకు అనుమతి ఉండడంతో కూటమి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చే సమయంలో బార్ లతో ఒక ఒప్పందం జరిగింది. బార్‌ల లైసెన్సు గడువు ముగిసే వరకూ పర్మిట్ రూంలకు అను మతులివ్వబోమని.తీరా ప్రైవేటు మద్యం షాపు లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తాగడా నికి వీల్లేక నాణ్యమైన మందు దొరుకుతున్నా ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరడం లేదు. కొందరు మద్యం తాగుతారని వాళ్ల ఇళ్లల్లో తెలి యకుండా జాగ్రత్త పడతారు. మరి కొం దరికి ఇంట్లో తాగే పరిస్థితులు ఉండవు.చాటుమాటు ప్రదేశంలో మద్యం తాగాలన్నా డేగ కళ్లతో తిరు గుతున్న పోలీసులకు చిక్కామా అంతే. తొలుత కేసు..తర్వాత కోర్టు.. ఆపై రూ.10 వేల ఫైన్. క్వార్టరు మందు రూ.200కే అందుబాటులో ఉన్నా..దానిని ఇంటి బయట గొంతు దాటించా లంటే మాత్రం మరో రూ.15 వేల ఖర్చుకు సిద్ధపడాల్సిందే.ఇప్పుడు ఎక్సైజ్ శాఖ దుకాణాల వద్ద తాగితే ఊరుకోబో మం టూ పెట్రోలింగ్ మొదలుపెట్టింది.ఈ పరిస్థితుల్లో చాలా మంది స్నేహితుల రూంలు,జన సంచారం లేని ప్రాం తాల్లో భయంభయంగానే పని కానిస్తున్నారు.
కేసులు 4926..
తూర్పుగోదావరిలో 138, డా.బీ ఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లాలో 146, కాకినాడ జిల్లాలో 171 మొత్తం మన్యం మినహా ఉమ్మడి తూర్పులో 455 ప్రైవేటు మద్యం దుకాణాలు ఓ 50 బార్లు ఉన్నాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఈ ఏడాది ఇప్పటి వరకూ తూర్పుగోదావరిలో 496 కేసులు నమోదు చేయగా 245 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా వేయగా 16 మందికి జైలు శిక్ష పడింది. 217 కేసులు విచారణ జరగాల్సి ఉంది. కోనసీమలో 1230, కాకి నాడ జిల్లాలో 3200 కేసులు పెట్టగా రూ.20 లక్షల వరకూ మందుబాబులు ఫైన్లు కట్టారు.
31ు దాటితే రూ.10వేలు
పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తుం టా రు.రక్తంలోని మద్యం శాతాన్ని అది కొలు స్తుం ది.బ్రీత్ ఎనలైజర్‌కి ఉంచే గొట్టంలో ఎవరు ఊదినా బీప్ శబ్దం వస్తుంది. కానీ 31ు ఆపై రీడింగ్ చూపిస్తే మాత్రం సదరు వ్యక్తి ఫొటోతో సహా ఆన్‌లైన్‌లో నమోదైపోవడంతో పాటు కేసు నమోదవుతుంది. పోలీసులు చెప్పిన సమ యానికి కోర్టుకు వెళితే రూ.10 వేలు ఫైన్. ఆపై బయట ‘ఇతర’ ఖర్చులూ ఉంటాయి. కల్లు తాగినా, ఓ లైటు బీరు కొట్టినా రీడింగ్ 31 దాటి పోతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 30 , 2025 | 03:04 PM