ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప్పొంగిన గోదారి

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:51 AM

ఒక ప్రాజెక్టు పట్టా లెక్కడానికి పుష్కరకాలం పట్టింది.. ఎప్పు డో 2015లో చంద్రబాబు విజన్‌.. అఖండ గోదావరి ప్రాజెక్టు అది నేటికి సాధ్యమైంది.. గత వైసీపీ ప్రభుత్వంలో హేవలాక్‌ బ్రిడ్జిపై అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఊరించి ఉసూరుమనిపించారు.. అయి తే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైందో లేదో ఆ ప్రాజెక్టును పట్టా లెక్కించింది

అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి

ప్రాజెక్టుకు శంకుస్థాపన

సైన్స్‌ మ్యూజియం ప్రారంభం

అటవీ అకాడమీకి భూమిపూజ

అభివృద్ధి దిశగా అడుగులు

వడివడిగా పవన్‌ పర్యటన

అభిమానుల ఉత్సాహం

కూటమి నేతల ఆనందం

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ఒక ప్రాజెక్టు పట్టా లెక్కడానికి పుష్కరకాలం పట్టింది.. ఎప్పు డో 2015లో చంద్రబాబు విజన్‌.. అఖండ గోదావరి ప్రాజెక్టు అది నేటికి సాధ్యమైంది.. గత వైసీపీ ప్రభుత్వంలో హేవలాక్‌ బ్రిడ్జిపై అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఊరించి ఉసూరుమనిపించారు.. అయి తే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైందో లేదో ఆ ప్రాజెక్టును పట్టా లెక్కించింది. గోదారిలో అభివృద్ధి దిశగా పర్యాటక అడుగులు వేస్తోం ది. దీనిలో భాగంగా రూ 94.44 కోట్లతో చేపట్టనున్న అఖండగోదావరి ప్రాజెక్టుకు గురువారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలు, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. తొలుత పుష్కరాల రేవులో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవలాక్‌ బ్రిడ్జి, పుష్కర ఘాట్‌, కడియం నర్సరీ, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం,గోదావరి కాలువ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామ న్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుంద న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజ మహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన మాట ప్రకారం అభి వృద్ధి చేస్తున్నామన్నారు. వికసిత్‌ రాజమహేంద్ర వరంలో భాగంగానే అఖం డ గోదావరి పర్యాటక ప్రాజె క్టుకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. విగ్రహాలు తొలగించకుండా గోదావరి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌కు సూచించారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పుష్కరఘాట్‌ అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరంను హెరి టేజ్‌ సిటీగా గుర్తించాలని కేంద్రమంత్రిని అభ్యర్థించారు. నేను ఇప్ప టికే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయు డు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం తూర్పు పర్యటనకు సింహద్వారమన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఉభ యగోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కల అఖండగోదావరి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి కింద కేంద్రం రూ.450 కోట్లుపైబడిన పర్యాటక ప్రాజెక్టులు మం జూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వ రరావు, మద్దిపాటి వెంకట్రాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌, చిర్రి బాలరాజు, పంతం నానాజీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, రుడా చైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం డీజీ ఏడీ చౌదరి, వీఐటీఎం డైరెక్టర్‌ సాజూ భాస్కరన్‌, తూర్పుగోదావరి జేసీ చిన్నరాముడు, ప్రొఫెసర్‌ డా.కె.శర త్‌కుమార్‌, డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీవో కృష్ణనాయక్‌, జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణు గోపాలరావు, జడ్పీ సీఈవో లక్ష్మణరావు పాల్గొన్నారు.

సైన్స్‌ మ్యూజియానికి స్వామి జ్ఞానానంద పేరు

రాజమహేంద్రవరం: బొమ్మూరులోని సైన్స్‌ మ్యూ జియానికి (రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రం) శ్రీ స్వామి జ్ఞానానంద పేరు పరిశీలనలో ఉందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఎంపీ పురందేశ్వరి, మంత్రి కం దుల దుర్గేష్‌తో కలిసి ఆయన గురువారం సైన్స్‌ మ్యూజి యం ప్రారంభించారు. మ్యూజియంలోని నీటి వనరుల గ్యాలరీ, ఫన్‌ ఫర్‌ సైన్స్‌ గ్యాలరీ, తారా మండలం, ఇన్నోవే షన్‌ హబ్‌, 75 ఏళ్లలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌, యాక్టివిటీ హాల్‌ తదితర విశేషాలను సుమారు 45 నిమి షాలపాటు తిలకించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి పెద్దపీట వేస్తు న్నాయన్నారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.15.20 కోట్లతో విజ్ఞాన కేంద్రం నిర్మించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నోలాజికల్‌ మ్యూజియం (వీఐటీఎం) ఆకృతి (డిజైన్‌)ని అందించిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో జన్మించి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద పేరును ఈ కేంద్రానికి పెట్టడానికి పరిగణనలో ఉందన్నారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ ఏది ఎలా పని చేస్తుందనే జిజ్ఞాస నుంచే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయ న్నారు. అనంతరం విజ్ఞాన కేంద్రం బ్రోచర్‌ని ఆవిష్కరించారు.

పట్టువదలని విక్రమార్కుడు..

సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టువదలని విక్ర మార్కుడు. ఆయన తగ్గరు మనమే తగ్గాలి అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం ఆయనను చూసి నేర్చుకోవాలి.. మనకు ఎడాప్టబులిటి రాదు.. ఆయన మనకు నేర్పిస్తార న్నారు. రాష్ట్ర హితవును.. రాజమండ్రి హితవును.. గోదావరి జిల్లాల హితవుని కోరుకునే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అని ఆయన చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. అనం తరం ఈ మాటల వెనుక అర్థం ఏంటో అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికలలో రూరల్‌ సీటు విషయమై పట్టుదల గురించి వ్యాఖ్యానించి ఉంటారని అనుకున్నారు.

షూ..చారా!

హోదాతో అంటుకునే ఎలాంటి అహాన్ని పవన్‌ దగ్గరకు రాని వ్వరు. ఆ మాటను అటవీ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి పవన్‌ రుజువు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో చేతిలో పెన్ను జారినా ఠక్కున అందించడానికి సిబ్బంది ఉంటారు. కానీ తన షూ లేసులు ఊడిపోతే పవన్‌ తానే స్వయంగా కట్టుకొన్నారు. సైగ చేస్తే బూటు కాలును చేతుల్లో పెట్టుకొని మరీ లేసులు కట్టే సిబ్బంది చుట్టూ ఉన్నా.. తన హోదాకు ముడిపెట్టలేదు. ఆ గుణానికే జనసేనానిని జనం అంతలా అభిమానిస్తారని పలువురు అనుకోవడం వినిపించింది.

యువత..కేరింత!

పవన్‌ను చూసేందుకు యువత ఉర్రూతలూ గారు. పవన్‌ను చూడటానికి అభిమానులు బారీ కేడ్లను ఛేదించుకుని పుష్కర ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతున్నంతసేపు పెద్దఎత్తున బాబులకే బాబు కల్యాణ్‌బాబు, డిప్యూటీ సీఎం జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. కుర్చీలు, సౌండ్‌ బాక్స్‌లపైకి ఎక్కారు. దీంతో కుర్చీలు విరిగిపోయాయి. ఈ కార్యక్రమం ముగిశాక పుష్కరఘాట్‌ మెయిన్‌ గేటులోంచి బయటకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. యువత పవన్‌ కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టారు. బైక్‌లతో దారి పొడవునా వెంబడించారు.

Updated Date - Jun 27 , 2025 | 12:51 AM