అఖండ గోదావరి.. ఆహ్లాదమే మరి!
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:52 AM
వేదంలా ఘోషించే గోదారమ్మ నగలో మరో కలికితురాయి చేరనుంది. అమర నాదంలా శోభిల్లే రాజమహేంద్రి చరిత్ర మరో కిరీటాన్ని అలంకరించుకోనుంది.
రూ.100 కోట్లతో 3 ప్రాజెక్టులు
2015లో సీఎం చంద్రబాబు కల
నాటి సంకల్పానికి నేడు అడుగులు
నేడు పవన్ కల్యాణ్ శంకుస్థాపన
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వేదంలా ఘోషించే గోదారమ్మ నగలో మరో కలికితురాయి చేరనుంది. అమర నాదంలా శోభిల్లే రాజమహేంద్రి చరిత్ర మరో కిరీటాన్ని అలంకరించుకోనుంది. వెయ్యేళ్ల చరిత్రను ఇముడ్చుకొన్న సాంస్కృతిక రాజధానిని ఎప్పటి నుంచో ఊరిస్తున్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టు కలను కూటమి ప్రభుత్వం నిజం చేస్తోంది. 100 ఏళ్లు సేవలందించిన రైల్వే పాత వంతెన.. రాజమహేంద్రవరం అంటేనే ఠక్కున స్ఫురించే ‘పుష్కరాల రేవు’.. కడియం పూల వనాలు.. నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాన్ని రూ.100 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో తీర్చిదిద్దనుండడంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు.
ఏమిటీ ‘అఖండ గోదావరి’
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.375 కోట్లతో ఏడు ప్రాజెక్టులను సాధించింది. వాటిలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్ ఏఎస్‌సీఐ) కింద అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మంజూరైంది. గోదావరి నది జన్మస్థలమైన త్రయంబకేశ్వర్ నుంచి బంగాళా ఖాతంలో కలిసే వరకూ 1465 కిలోమీటర్లు ఉర కలేస్తుంది. ఇంత నిడివిలో ఎక్కడా కూడా రాజమహేంద్రవరం వద్ద ఉన్నంత 3 కిలోమీటర్ల వెడల్పు కనిపించదు.అందుకే ‘అఖండ గోదావరి’ అనే ఖ్యాతి గోదారమ్మ మనకే సొంతం చేసింది. ఆ పేరుతోనే ఈ అద్భుత ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద రూ.100 కోట్లతో మూడు ప్రాం తాలు పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు.ఈ ప్రాజెక్టును సాధ్య మైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.
నాటి కల.. నేడు తీరింది!
గత పుష్కరాలకు సీఎం చంద్రబాబు గోదావరిలో బోట్ మీద పయనించి అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు శాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటించి డిజైన్లు సిద్ధం చేశారు.కానీ 2019లో వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును ప్రక్కన పడేసింది. మళ్లీ అధికారంలోకి టీడీపీ కూటమిరావడం, తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ అడుగులు పడ్డాయి.
ఆకర్షణీయంగా పుష్కర ఘాట్
పుష్కరాల రేవుకు ఎంతో చరిత్ర ఉంది. ఈ రేవు దగ్గర పుష్పగిరి అనే కొండ ఉండేది. దీంతో ఇక్కడి రేవుకు కాలక్రమేణా పుష్కరాల రేవు అని పేరొచ్చింది. రాజమహేంద్రవరం కోటకు సంబంధించిన ప్రాకారం కూడా ఇక్కడ ఉండేది. రైలు వంతెన అభివృద్ధిలో భాగంగా దానిని తొలగిం చారు.ఈ ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. గులాబీ ఇసుక రాతితో (పింక్ శాండ్ స్టోన్) తో ఘాట్‌ని ఆకర్షణీయంగా నిర్మిస్తారు. ఆధ్యా త్మికత ఉట్టిపడేలా గోదావరి మాత ఆలయం, 9 ఉపాలయాలు ఏర్పాటు చేస్తారు. గోదావరి హార తి ప్రదేశాన్ని మెరుగు పరుస్తారు.రూ.29 కోట్లతో అంచనాలు రూపొందించారు.ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారు.
ఆహా..హేవలాక్
127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వం తెనను ఆధునీకరిస్తారు.ఈ వంతెన పొ డవు 2700 మీటర్లు కాగా 54 స్పాన్లు (స్తంభాలు) ఉన్నాయి.వీటిలో 25 స్పాన్ల వరకూ 1200 మీటర్ల వంతెనను అభి వృద్ధి చేస్తారు. ప్రతి స్పాన్‌ని ప్రత్యేక థీమ్‌తో ఆకర్షణీయంగా రూపొందిస్తారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి ఉట్టిపడే విధంగా వినోద కేంద్రాలు ఏర్పాటు చే స్తారు.120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రిడ్జి లంకను అనుసంధానం చేస్తారు. వంతెన నుంచి మెట్లు నిర్మిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానం లో టెంట్ సిటీ,బోటింగ్ వంటి వాటిని అందుబాటులోకి తెస్తారు.ఈ ప్రాజెక్టుకు రూ.46 కోట్లు ఖర్చు చేస్తారు.
నర్సరీలకు..ప్రోత్సాహం
నర్సరీలను మరింత ప్రోత్సహించడానికి కడి యపులంకలో రూ.3 కోట్లతో 3 ఎకరాల్లో కడి యం నర్సరీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అభివృద్ధి చేస్తారు. దీనిలో వివిధ రకాల మొక్కల ప్రద ర్శన, చిన్న ఎగ్జిబిషన్లు, ఈవెంట్లు, మొక్కల విక్రయ కేంద్రాలు,గ్రీన్ హౌస్ టూర్లు, సీజ నల్ పుష్పోత్సవాలు, మొక్కల పెంపకం, సం రక్షణపై కార్యశాలలు,ఇంటరాక్టివ్ సెషన్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తారు. నర్సరీల విశి ష్టతను పర్యాటకులకు చేరువచేయనున్నారు.
నిడదవోలు వైపు..చూపు
నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాన్ని అభి వృద్ధి చేయనున్నారు.రూ.2 కోట్లతో యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రాజగోపురాన్ని ఆధునీ కరిస్తారు. సమిశ్రగూడెం గోదావరి కాలువ దగ్గర రోడ్డు పక్కన అన్ని సదు పాయాలతో సౌకర్యాలు, బోటింగ్ ఉంటాయి. హారతి ఘాట్‌ని మరింతగా అభివృద్ధి చేస్తారు.
2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తాం..
అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు 2027 గోదావరి పుష్క రాల నాటికి పూర్తి చేస్తాం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధానికి రూ.100 కోట్లతో మరింత శోభను తీసుకురానున్నాం. త్వరలోనే పిచ్చుకలంక పర్యటనకు ఒబెరాయ్ గ్రూపు రానుంది. - మంత్రి కందుల దుర్గేష్
Updated Date - Jun 26 , 2025 | 12:52 AM