అయినవిల్లి సిద్ధి వినాయకునికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలు
ABN, Publish Date - May 19 , 2025 | 12:24 AM
అయినవిల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలను ఆదివారం బహూకరించారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు వంశవారసులు... వెంకటకృష్ణరాజు- దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకటసూర్యసు
అయినవిల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామికి రూ.30లక్షల విలువైన బంగారు పాదుకలను ఆదివారం బహూకరించారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బరాజు వంశవారసులు... వెంకటకృష్ణరాజు- దుర్గావతి దంపతులు, వారి కుమారులు వెంకటసూర్యసుబ్బరాజు-శ్వేత దంపతులు 369 గ్రాములు బంగారు శఠారి (పాదుకలు)ని సమర్పించారు. అర్చకులు వాటికి సంప్రోక్షణ నిర్వహించారు. దాతను శేష వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతను అభినందించి స్వామివారి చిత్రపటం బహూకరించారు.
Updated Date - May 19 , 2025 | 12:24 AM