ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల మూసివేత
ABN, Publish Date - Jul 27 , 2025 | 12:50 AM
రంపచోడవరం/మారేడుమిల్లి, జూలై 26 (ఆ ంధ్ర జ్యోతి): అధిక వర్షాల కారణంగా ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఎడతెరిపి లేకుండా వ ర్షాలు కురుస్తుండడంతో కొండవాగులు ఉధృ తంగా ప్రవహిస్తున్నాయ
అధిక వర్షాల కారణంగా నిర్ణయం : ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం/మారేడుమిల్లి, జూలై 26 (ఆ ంధ్ర జ్యోతి): అధిక వర్షాల కారణంగా ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఎడతెరిపి లేకుండా వ ర్షాలు కురుస్తుండడంతో కొండవాగులు ఉధృ తంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారంతపు సెలవులు కావడంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉం డడంతో పలు జలపాతాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. మారేడుమిల్లి మండలంలోని గుడిసె, చావడికోట, జలతరంగణి, అమృతధార, దుంపవలస, వలస జలపాతాలను మూ సివేశామన్నారు. ఆయా జలపాతాల వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులు నిఘా ఉంచి పర్యాటకులకు ఎవరూ అటు వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో సింహాచలం ఆదేశించారు.
Updated Date - Jul 27 , 2025 | 12:50 AM