ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మ, నాన్న ఉండి.. అనాథలే!

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:35 AM

రాజానగరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తల్లి వివాహేతర సంబంధం కారణంగా పట్టించుకో కపోవడం, ఆపై తండ్రి కూడా వదిలివెళ్లిపోవడంతో అందరూ ఉన్న అనాథలుగా కాలం వెళ్ల దీస్తున్న చిన్నారుల హృదయ వేదన ఇది. వివరా ల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొంత మూరు లోని చెంచుల కాలనీలో నివాసముంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్‌ దంపతులకు తేజ కిరణ్‌(10), భానుప్రకాష్‌ (8) పిల్లలు ఉన్నారు.

చిన్నారులు తేజ కిరణ్‌, భానుప్రకాష్‌

పట్టించుకోని తల్లి

వదిలివెళ్లిపోయిన తండ్రి

దీన స్థితిలో చిన్నారులు

రాజానగరం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తల్లి వివాహేతర సంబంధం కారణంగా పట్టించుకో కపోవడం, ఆపై తండ్రి కూడా వదిలివెళ్లిపోవడంతో అందరూ ఉన్న అనాథలుగా కాలం వెళ్ల దీస్తున్న చిన్నారుల హృదయ వేదన ఇది. వివరా ల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొంత మూరు లోని చెంచుల కాలనీలో నివాసముంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్‌ దంపతులకు తేజ కిరణ్‌(10), భానుప్రకాష్‌ (8) పిల్లలు ఉన్నారు. వారు రాజమహేంద్రవరంలోని నారాయణ స్కూ ల్లో 4,2 తరగతులు చదువుతున్నారు. తండ్రి జయరామ్‌ పెయింటింగ్‌ వర్కు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. భార్య ధనలక్ష్మి కర్రీ పాయింట్‌లో కేటరింగ్‌ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో మందపల్లి ప్రవీణ్‌ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి అది వివాహేతర బంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిన ధనలక్ష్మి ఇద్దరు పిల్లలను, భర్తను పట్టించుకోవడంలేదు. కూతురి ప్రవర్తన తీరును మందలించాల్సిన తల్లి తులసమ్మ.. అల్లుడు జయరామ్‌ బయటకు వెళ్లిపోయేలా చేసింది. ఏడాదిగా తల్లి వద్దనే ఉంటున్న చిన్నారులిద్దరితో ప్రియుడికి అవసరమైన సేవలు చేయించేది. తల్లి చెప్పిన పనులు చేయకపోతే ప్రియుడు ప్రవీణ్‌కుమార్‌ చిన్నారులను బెల్టు, వైర్లతో శరీరంపై తట్టులు వచ్చేలా కొడుతూ చిత్రహింసలకు గురిచేసే వాడు. దీంతో విషయం తెలుసుకున్న చిన్నారుల మేనమామ పాలవలస బాలమణికంఠ రాజాన గరం పోలీసులకు ఫిర్యాదు చేసి రాజమహేంద్ర వరంలోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులకు చికిత్స చేయించి, తన ఇంటికి తీసుకెళ్లాడు. 3 నెలలుగా మేనమామ సంరక్షణలో ఉంటున్న చిన్నారులిద్దరూ తమను నాన్న వద్దకు చేర్పించా లంటూ దీనంగా మేనమామను వేడుకుంటు న్నారు. దీంతో మేనమామ బాలమణికంఠ చిన్నా రులను వెంటబెట్టుకుని 3నెలలుగా రాజానగరం పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కడం దిగడం చేస్తున్నా డు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ నారాయ ణమ్మను శుక్రవారం ఫోన్‌లో సంప్రదించగా చిన్నారుల తండ్రి శ్రీకాకుళంలో ఉంటున్నాడు. ఒకటి, 2రోజుల్లో వస్తానన్నాడు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులు ఎవరి వద్ద ఉంటామంటారో విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమె బదులిచ్చారు.

Updated Date - Apr 26 , 2025 | 12:35 AM