EAPCET Update: ఈఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:39 AM
ఈఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తెలిపారు. ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్
ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుమూర్తి
అమరావతి/నూజివీడు టౌన్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌కు ఏర్పా ట్లు దాదాపు పూర్తయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి తెలిపారు. ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ చాన్స్‌లర్‌గా శుక్రవారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీల్లో నాణ్య తా ప్రమాణాలు పెంచడానికి చర్యలు చేపడతామన్నారు. వసతులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆర్జీయూకేటీల్లో చదివిన విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. అన్ని కోర్సుల ప్రవేశ పరీక్షలకు తేదీలు ప్రకటించామని, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 05:39 AM