శ్రీశైలంలో విరాళాలు
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:02 AM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణకు, ప్రాణదాన ట్రస్ట్‌కు పలువురు భక్తులు విరాళాలను ఆలయ అధికారులకు అందజేశారు.
నంద్యాల ఎడ్యుకేషన, జూలై 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో అన్న ప్రసాద వితరణకు, ప్రాణదాన ట్రస్ట్‌కు పలువురు భక్తులు విరాళాలను ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీప్రసన్న కాంట్రాక్టింగ్ సంస్థ రూ.5లక్షలను దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. యాదాద్రి భువనగిరికి చెందిన రాజేంద్రప్రసాద్‌రెడ్డి రూ.1,00,293లను అన్నప్రసాద వితరణకు విరాళం అందజేశారు. ఆలయ పర్యవేక్షకురాలు హిమబిందు విరాళాలను స్వీకరించి రశీదును, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
శ్రీశైలం పంచమఠాల్లో ప్రత్యేక పూజలు
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలోని పంచమఠాల్లో ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో విశేష అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, సిబ్బందితో కలిసి ఈవో మఠాల ఆవరణల్లో దేవతా మొక్కలను నాటారు.
Updated Date - Jul 08 , 2025 | 12:03 AM