IPS Sunil Kumar News: చెప్పకుండా విదేశాలకు ఎందుకెళ్లారు
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:04 AM
జగన్ హయాంలో అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెలలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నెలలో జవాబివ్వకుంటే క్రమశిక్షణ చర్యలు
సీనియర్ ఐపీఎస్ సునీల్‌కు ప్రభుత్వం హెచ్చరిక
అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జగన్ జమానాలో అనుమతి లేకుండా విదేశాల్లో అనధికారిక పర్యటనలు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై రాష్ట్రప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ప్రభుత్వం ఆమోదించి అనుమతిచ్చిన ట్రావెల్ ప్లాన్‌కు విరుద్ధంగా దుబాయ్, జార్జియా, యూఏఈ, యూకే, అమెరికా దేశాలకు వెళ్లినందుకు చర్యలకు ఉపక్రమించింది. అనుమతి తీసుకోకుండా ఎందుకు విదేశాలకు వెళ్లారో నెలలోగా సమాధానం చెప్పాలని, లేదంటే తప్పు చేసినట్లు భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 04:05 AM