Digital Begging: సర్.. ‘ఫోన్ పే’ ప్లీజ్!
ABN, Publish Date - Mar 02 , 2025 | 05:04 AM
నగదు లావాదేవీల వ్యవహారంలో మరిన్ని మార్పులు మార్పులు వచ్చాయి. 5 రూపాయల టీకి కూడా ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులో ఉన్నాయి.
గుంటూరులో హైటెక్ భిక్షాటన
ఫ్లెక్సీలతో తమిళ మహిళ యాచన
ABN AndhraJyothy: కాలానికి అనుగుణంగా సమాజంలో పలు మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా నగదు లావాదేవీల వ్యవహారంలో మరిన్ని మార్పులు మార్పులు వచ్చాయి. 5 రూపాయల టీకి కూడా ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎవరూ చిల్లర దగ్గర ఉంచుకోవడంలేదు. దీనిని గుర్తించిన కొందరు యాచకులు.. తమ శైలిని మార్చుకుంటున్నారు. ‘చిల్లర లేదు’ అన్న మాట రాకుండా.. వారు కూడా డిజిటల్ పేమెంట్ల బాట పట్టారు. ఫేన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ మాధ్యమాలను వినియోగించి యాచన చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ విభిన్న ప్రతిభావంతుడైన కుమారుడు విక్రమ్‌ను తీసుకొని గుంటూరు నగరంలో డిజిటల్ భిక్షాటన చేస్తున్న వైనం ఆకర్షిస్తోంది. బిడ్డ పరిస్థితిని వివరించేందుకు తనకు తెలుగు రాకపోవడంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆమె దీనిలోనే భిక్షాటన కింద నగదు చెల్లింపు కోసం గూగుల్ పే, ఫోన్ పే స్కానర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆమెను చూసిన వారు ‘చిల్లర లేదు’ అని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేకుండా అంతో ఇంతో ఫోన్ చేస్తున్నారు.
- గుంటూరు, (ఆంధ్రజ్యోతి)
Updated Date - Mar 02 , 2025 | 05:04 AM