ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Barashahid Dargah: దారులన్నీ దర్గా వైపే

ABN, Publish Date - Jul 09 , 2025 | 06:39 AM

ఎటు చూసినా వాహనాలు.. దారులన్నీ దర్గా వైపే అన్నట్టుగా నెల్లూరు నగరం కిక్కిరిసిపోయింది. మంగళవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో గంధ మహోత్సవం జరిగింది.

  • రొట్టెల పండగకు భారీగా తరలివచ్చిన భక్తులు

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఎటు చూసినా వాహనాలు.. దారులన్నీ దర్గా వైపే అన్నట్టుగా నెల్లూరు నగరం కిక్కిరిసిపోయింది. మంగళవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో గంధ మహోత్సవం జరిగింది. కోటమిట్టలోని అమీనియా మసీదులో గంధం కలిపిన బిందెలతో ఊరేగింపుగా బారాషహీద్‌ దర్గాకు తీసుకొచ్చారు. అనంతరం దర్గాలోని అమరుల సమాధాలకు కడప పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ, ఇతర మతపెద్దలు గంధం ఎక్కించారు. ఈ సందర్భంగా గంధం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ ఘట్టం ముగియడంతో అధికారికంగా రొట్టెల పండుగ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వరాల రొట్టెలను ఇచ్చిపుచ్చుకున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:41 AM