కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:52 PM
కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.
జమ్మలమడుగు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పల్లెలు, పట్టణాల్లో దెబ్బతిన్న రోడ్ల స్థానంలో కొత్తగా రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యం కల్పించారు. అలాగే విద్యార్థినీ విద్యార్థుల ప్రభుత్వ వసతి గృహాల్లో ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతోపాటు కొన్ని భవనాలు ఆధునికీకరణ చేసి వాటిని చక్కగా తీర్చిదిద్దారు. పాత బస్టాండులోని కూరగాయల మార్కెట్‌వీధి వెళ్లే రోడ్డు వెడల్పు చేసి వ్యాపారస్థులకు, వాహనదారులకు, దుకాణాదారులకు వసౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ అధికారం అయిదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు దారుణంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగస్టు 1వ తేదీ జమ్మలమడుగు పట్టణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా ఇంకా సమస్యలుంటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - Jul 29 , 2025 | 11:52 PM