అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:44 AM
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తానగరం ఆంజనేయస్వామి గుడిలో ఆర్ట్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- మంత్రి కొల్లు రవీంద్ర
- జిల్లావ్యాప్తంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభం
మచిలీపట్నం, జూలై2)ఆంధ్రజ్యోతి):
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గంలోని సుల్తానగరం ఆంజనేయస్వామి గుడిలో ఆర్ట్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రెయిన్‌లు లేక మురుగు గృహాల ముందే నిలిచిపోతోందని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. మచిలీపట్నంలోని 48వ డివిజన్‌లో మంత్రి పర్యటించిన సమయంలో అర్హులైన పేదలకు టిడ్కోగృహాలు ఇవ్వాలని ప్రజలు కోరారు.
- పామర్రు నియోజకవర్గంలోని కొబ్బరితోట, యలకుర్రు, అరండల్‌పేటలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పర్యటించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం త్వరలో అనుమతులు ఇస్తుందని తెలిపారు.
-పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో రోడ్లు వేయించాలని, ఇళ్ల పట్టాలు ఇప్పించాలని, తాగునీటిని అందించాలని గ్రామస్థులు కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు.
-అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం విశ్వనాధపల్లిలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పర్యటించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు ఇప్పించాలని, గృహాల మధ్య డ్రెయిన్‌లు సక్రమంగా లేవని, వాటిని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరారు.
-గన్నవరంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు. పింఛన్లు, బియ్యం కార్డులు ఇప్పించాలని, రోడ్లు వేయించాలని, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. రహదారుల అభివృద్ధికి అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే యార్లగడ్డ సూచించారు.
-గుడివాడ పట్టణం 3వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో, వార్డుల్లో డ్రెయిన్‌ల సమస్యను పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, జిల్లా వ్యాప్తంగా జరిగిన తొలి అడుగు కార్యక్రమం దృష్టికి పింఛన్లు, వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ నగదు జమ కావడం లేదని, ఇళ్లస్థలాల సమస్యలను తెచ్చారు. అన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు.
Updated Date - Jul 03 , 2025 | 12:44 AM