Raghurama Krishna Raju: సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ABN, Publish Date - Jul 19 , 2025 | 06:42 AM
సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కసరత్తు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ పిటిషన్ల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
నేరాల నియంత్రణకు చట్ట సవరణ
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
డిప్యూటీ స్పీకర్ రఘురామ వెల్లడి
అమరావతి, జూలై18 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కసరత్తు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ పిటిషన్ల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ప్ర స్తుత చట్టానికి మరింత పదును పెట్టేలా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటీ శాఖల కార్యదర్శులతో చర్చించినట్లు చెప్పారు. శుక్రవారం శాసనసభలోని తన చాంబరులో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, గురజాల జగన్మోహన్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్స్ నియంత్రణపై సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో అసెంబ్లీ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మూలాల నుంచి సైబర్ నేరాల సిండికేట్ మొత్తాన్ని నియంత్రించేలా చట్ట సవరణ తీసుకురానున్నట్లు చెప్పారు.
Updated Date - Jul 19 , 2025 | 06:44 AM