ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan : అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలి

ABN, Publish Date - Jan 24 , 2025 | 03:03 AM

అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి.....

  • ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలి

  • సమస్యల పరిష్కారంపై నివేదిక ఇవ్వండి

  • అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్‌

  • ఎర్రచందనం అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా

  • అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపుపై ప్రణాళిక

  • అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు

  • సిబ్బంది కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ గురువారం అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా.. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు. దశల వారీగా పూర్తి స్థాయి మార్పులు, చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పని చేయాలని పీసీసీఎఫ్‌, హెచ్‌వోఎ్‌ఫఎ్‌ఫలను ఆదేశించారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలని సూచించారు. సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి, పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్ఠం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

అడవుల్లో అరుదుగా లభించే నాణ్యమైన, మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, గిరిజనులను భాగస్వామ్యం చేసి, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కార్పొరేట్‌ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆదాయమిచ్చే అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రం 50 శాతం పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని, నగర వనాలు, ఎకో టూరిజం అభివృద్ధికి, కలప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 03:04 AM