డీఈవో కార్యాలయం ముట్టడి
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:13 AM
టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్‌గా జరపాలని కోరుతూ ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
-మాన్యువల్‌గా బదిలీల కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్
- ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌తో నష్టపోతున్నామని ఆవేదన
మచిలీపట్నం టౌన్, జూన్ 8(ఆంధ్రజ్యోతి):
టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ మాన్యువల్‌గా జరపాలని కోరుతూ ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తొలుత ధర్నా వేదిక వద్ద నుంచి ప్రదర్శనగా డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు సుబ్రహ్మణ్యం, లెనిన్, కొమ్ము ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,200 మంది సెకండరీ టీచర్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ మాన్యువల్‌గా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకుడు బి.లంకేశ్, యూటీఎఫ్ నాయకులు బి.కనకరావు, షౌకత, సుందరయ్య, కె.ఎ.ఉమామహేశ్వరరావు, ఎస్.పి.మనోహర్, ఎస్‌టీయూ నాయకులు చంద్రశేఖర్, పి.ఇమ్మానియేలు, ఏపీటీఎఫ్ 257 సంఘం నాయకులు ఏ.సుబ్రహ్మణ్యం, సాంబశివరావు, రాధిక, ఎస్.ఖాసీమ్, ఈ.వి.రామారావు, ఏపీటీఎఫ్ 1938 సంఘ నాయకులు కె.శేషగిరి, తమ్ము నాగరాజు, ఏపీపీటీఏ నాయకులు ఏ.ఆర్.అస్లాం, సదారత, పీఆర్‌టీయూ నాయకులు పి.శ్రీనివాసరావు, డీపీఆర్‌టీయూ నాయకులు ఎన్.రాంబాబు, జి.పెరుమాళ్లు, బీటీఏ నాయకుడు టి.సూరిబాబు, ఎంటీయూ నాయకుడు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 01:14 AM