AP government: ఉద్యోగుల బదిలీలకు మరోవారం గడువు
ABN, Publish Date - Jun 02 , 2025 | 06:03 AM
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును జూన్ 9వ తేదీ వరకు పెంచారు. ఆ తర్వాత మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది.
9వ తేదీ వరకు పెంపునకు సీఎం ఆమోదం
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఈమేరకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇందుకనుగుణంగా అప్పటి వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. జూన్ 10వ తేదీ నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. గత నెల 15వ నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీలకు ఆర్థికశాఖ అనుమతిచ్చింది. ఆ గడువు జూన్ 2తో ముగుస్తుండటంతో తాజాగా మరో వారం రోజులు పొడిగించారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 06:03 AM