ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా డీసీఎంఎస్‌ చైర్మన ప్రమాణ స్వీకారం

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:40 PM

ఉమ్మడి జిల్లాల జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మనగా నాగేశ్వరరావు యాదవ్‌ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులో ఘనంగా నిర్వహించారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న నాగేశ్వరరావుయాదవ్‌

ప్రమాణం చేసిన నాగేశ్వరరావు యాదవ్‌

హాజరైన మంత్రులు ఎనఎండీ ఫరూక్‌, బీసీ జనార్దనరెడ్డి

నంద్యాల ఎడ్యుకేషన, జూన 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాల జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మనగా నాగేశ్వరరావు యాదవ్‌ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్‌ జిల్లా అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా కర్నూలు ఎమ్పీ నాగరాజు, డోన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కేడీసీసీ ఛైర్మన విష్ణువర్ధనరెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసిరెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌గౌడ్‌, కేంద్ర ఫుడ్‌ కార్పొరేషన సభ్యుడు నరహరి విశ్వనాథరెడ్డి, రాష్ట్ర టీడీపీ నాయకులు ఏవీఆర్‌ ప్రసాద్‌, ఎనఎండీ ఫిరోజ్‌, వీరభద్రగౌడ్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎనఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ పార్టీలో చిన్నప్పటి నుంచి నేటి వరకు పనిచేస్తున్న నాగేశ్వరరావుయాదవ్‌ను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించిందన్నారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలనతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని, పార్టీ జెండాయే ముఖ్యమని ఎన్ని కేసులనైనా ఎదుర్కొని నిలిచిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. డోన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి మాట్లాడుతూ నాగేశ్వరరావుయాదవ్‌ ప్రతి ఒక్కరికీ సుపరిచితుడని, కష్టపడే మనస్తత్వంగల వ్యక్తి అన్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ శాశ్వత కరువు, వలసల నిర్మూలనకు కృషిచేయాలని, సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైౖర్మన నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి రైతుకు అండగా ఉంటానని అన్నాడు.

Updated Date - Jun 15 , 2025 | 11:40 PM