ఆలమూరు నుంచి తిరుమలకు సైకిల్ యాత్ర
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:28 AM
దేశం సుభిక్షంగా ఉండాలంటూ మండలంలోని ఆలమూరు గ్రామం నుంచి తొమ్మిది మంది యువకులు సోమవారం తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టారు.
రుద్రవరం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : దేశం సుభిక్షంగా ఉండాలంటూ మండలంలోని ఆలమూరు గ్రామం నుంచి తొమ్మిది మంది యువకులు సోమవారం తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండి, పాడి పంటలతో వర్థిలాలని ఆకాంక్షిస్తూ సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. ఆలమూరు గ్రామం నుంచి తిరుమలకు సుమారు 250 కి.మీ దూరం ఉందన్నారు. మూడురోజుల్లో తిరుమలకు చేరుకుంటామని యువకులు తెలిపారు.
Updated Date - Apr 08 , 2025 | 12:28 AM